India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ సచివాలయం సమీపంలోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఈనెల 4న ‘ఛలో నెక్లెస్‌రోడ్ ” పేరిట ఓ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 4న నిర్వహించే కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ పార్టీ నేతలను కోరారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో ప్రచారం చేస్తారని జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈనెల 6వ తేదీన రాహుల్ గాంధీ వస్తున్నారని కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. శాసనసభ ఎన్నికల్లో మంగళసూత్రం అమ్మి నామినేషన్ వేసిన బండి సంజయ్‌కి వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కి బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అని, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా దిగజారే వ్యక్తి బండి సంజయ్ అంటూ ద్వజమెత్తారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలో గురువారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఉన్న ఆర్డీవో కార్యాలయంలో బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చని చెప్పారు.
ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ ఫీజు చెల్లింపునకు గడువు పెంచింది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల నాలుగో తేదీ వరకు ఫీజు చెల్లింపు చేయవచ్చని ఈరోజు ప్రకటన విడుదల చేసింది. దీనిపై స్పందించిన జిల్లా ఇంటర్ కార్యాలయం అధికారులు విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించారు.
HYD దిల్‌సుఖ్‌నగర్ వద్ద ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యాసంస్థలు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, మేకింగ్ కోర్సులు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు స్కాలర్‌షిప్ పరీక్ష మే 19న జరుగుతుందని, ఆసక్తి గలవారు, విద్యాసంస్థలో సంప్రదించాలని సూచించారు.
బీడీ కార్మికుల బతుకు పోరాటంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హామీ ఇచ్చారు. గురువారం నిజామాబాద్‌లో బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు లక్షల బీడీ కార్మికులు 14 బీడీ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తేసి వారికి ఉపాధి భరోసా కల్పిస్తామని చెప్పారు.
HYD దిల్‌సుఖ్‌నగర్ వద్ద ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యాసంస్థలు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, మేకింగ్ కోర్సులు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు స్కాలర్‌షిప్ పరీక్ష మే 19న జరుగుతుందని, ఆసక్తి గలవారు, విద్యాసంస్థలో సంప్రదించాలని సూచించారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సిఐ శశిధర్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికలు పురస్కరించుకుని కేంద్ర బలగాలతో కలిసి ప్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
HYD సిటీ సివిల్ కోర్టులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోర్టులో పనిచేసే ఉద్యోగులు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బెయిల్‌కు సంబంధించిన పేపర్లు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.