Telangana

News May 2, 2024

HYD: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కోర్ట్ ఉద్యోగులు

image

HYD సిటీ సివిల్ కోర్టులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోర్టులో పనిచేసే ఉద్యోగులు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బెయిల్‌కు సంబంధించిన పేపర్లు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

తండాలను పంచాయతీలు చేసిన ఘనత KCRదే: ప్రవీణ్ కుమార్

image

తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత KCRకే దక్కుతుందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు, పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్ హాయంలోనే జరిగిందన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాడీలకు మంత్రి పదవి దక్కలేదని మండిపడ్డారు.

News May 2, 2024

వేములవాడ రాజన్న హుండీ లెక్కింపు

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపును గురువారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో నిర్వహించారు. గడిచిన 21రోజులకు గాను స్వామివారికి రూ.1కోటి 52లక్షల 15 వేల 575 నగదుతో పాటు 218 గ్రాముల బంగారం, 11కిలోల 500గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ EO కృష్ణప్రసాద్, కరీంనగర్ AC కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ, AEO హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.

News May 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*జగిత్యాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్.
*మెట్‌పల్లిలో రూ.1,70,000 నగదు సీజ్.
*చత్తీస్‌గడ్ ఎన్కౌంటర్లో భీమదేవరపల్లి మండల వాసి మృతి.
*మెట్పల్లిలో కోర్టుకు హాజరు కాకుండా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్.
*ఎన్నికల భద్రత ఏర్పాట్లపై రామగుండం సీపీ సమీక్ష.
*బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన బుగ్గారం ఎంపీపీ, జడ్పీటీసీ.
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకుల విస్తృత ప్రచారం.

News May 2, 2024

ADB: హత్య కేసులో ఆరుగురికి జైలు శిక్ష

image

వాంకిడి మండలం ఖిర్డి గ్రామంలో భూతగాదాల విషయంలో జంట హత్యలు చేసిన కేసులో ఆరుగురికి జీవిత ఖైదు, రూ.15వేల చొప్పున జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా స్టేషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ తీర్పు ఇచ్చినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. 2019లో భూ తగాదాలను దృష్టిలో పెట్టుకొని శ్యామ్ రావు(52), భార్య ధారాభాయ్(45)లను హత్య చేసినట్లు రుజువైనందున శిక్ష ఖరారు చేశారు.

News May 2, 2024

సిద్దిపేట: కార్నర్ మీటింగ్.. రేవంత్ రెడ్డి స్పీచ్ హైలెట్స్

image

*కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15న రైతులను రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించారు.
*హరీష్ రావు రాజీనామా రాసిపెట్టుకో.. రుణమాఫీ చేసిన తర్వాత సిద్దిపేట చౌరస్తాలో లక్షమందితో సమావేశం నిర్వహిస్తాం.
*సిద్దిపేటలో దొరల రాజ్యం నడుస్తోంది.
*దుబ్బాక రావు.. సిద్దిపేట రావు పొద్దున రెండు పార్టీలు రాత్రి ఒక్కటే పార్టీ,
*మల్లన్నసాగర్‌లో భూములు గుంజుకొని అక్రమ కేసులు పెట్టివారికి ఎంపీ టికెట్

News May 2, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✒ఉమ్మడి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్
✒అదనపు EVMలు సిద్ధం:కలెక్టర్లు
✒NGKL:గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త
✒KCR ప్రచారాన్ని నిషేధిస్తే BRS ప్రభంజనం ఆగదు:RSP
✒BJP గెలిస్తే రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం: మల్లు రవి
✒పలుచోట్ల వడదెబ్బపై అవగాహన
✒ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి:DK అరుణ
✒BJP అధికారంలోకి వస్తే రాజ్యాంగానికే ప్రమాదం:కోదండరాం
✒పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు: కలెక్టర్లు

News May 2, 2024

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎక్కడ ఉంటారో ప్రజలకు తెలియదు: రవిచంద్ర

image

నేలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన రోడ్ షోలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. BRS పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పక్కా లోకల్ అని, ఇక్కడే షుగర్ ఫ్యాక్టరీ కూడా నడిపిస్తున్నారని చెప్పారు. నామా ఖమ్మం నెహ్రూ నగర్ నివాసి అని, ఎల్లవేళలా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాంటి నాయకుడిని ఎంపిక గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎక్కడ ఉంటారో కూడా ప్రజలకు తెలియదన్నారు.

News May 2, 2024

మనమే నంబర్ వన్: బండి సంజయ్

image

కరీంనగర్ నగరంలోని మంచిర్యాల చౌరస్తా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను బండి సంజయ్ నిర్వహించారు.‌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మనమే నంబర్ వన్. బ్యాలెట్ పేపర్లో కూడా 1వ స్థానం మనదే అన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఎండలను లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ, ఊరూవాడా కదిలి వచ్చి బ్యాలెట్ పేపర్లోని 1వ నంబర్ పక్కనున్న పార్టీ గుర్తుపై బటన్ నొక్కి ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

News May 2, 2024

నిజామాబాద్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును మే 4వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తెలిపారు. వార్షిక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించబడతాయని తెలిపారు. ఈ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు మరో రెండు రోజులు ఫీజు గడువును పొడిగించామని తెలిపారు.