India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ శివారులో ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నర్సయ్య మృతిచెందగా అతడి భార్య లలిత, దిలీప్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
HYD, ఉమ్మడి RRలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్,జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.
HYD, ఉమ్మడి RRలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్,జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.
ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 3, 4, 5, 6 తేదీల్లో హోమ్ ఓటింగ్ నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంటు సెగ్మెంట్‌లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1758 మంది ఓట్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారని ఆయన వివరించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండగా.. ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం ఇబ్రహీంపేటలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నాంపల్లి, మునగాలలో 46.4 డిగ్రీలు, తెల్దేవరపల్లి, కేతేపల్లి, మాడులపల్లిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకి రావద్దని సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో భానుడి తాపానికి జనం వణికిపోతున్నారు. 2రోజులుగా జిల్లాలో 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం వరకు దీర్ఘకాల వడగాలులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శుక్రవారం మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన గీట్ల ప్రతాప్ రెడ్డి(102) అనే పోలీసు పటేల్ అనారోగ్యంతో మరణించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. HYD-LV ప్రసాద్ ఐ ఆసుపత్రి టెక్నీషియన్ రాజన్న ఆధ్వర్యంలో మృతుడి నేత్రాలను సేకరించారు. కుటుంబ సభ్యులు దామోదర్ రెడ్డి, సుగుణ, నరోత్తం రెడ్డి, పుష్ప, రామకృష్ణారెడ్డి, పద్మ, సుజాత, రాం రెడ్డి, పుష్పా, కృష్ణారెడ్డి, నిర్మల ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్ మాడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన కాశవేణి రవి అలియాస్ వినయ్ మృతి చెందాడు. కాగా, 33 ఏళ్ల క్రితం తన తండ్రి ఉపాధి నిమిత్తం మంచిర్యాలలో ఉండగా.. మావోయిస్టుల్లో చేరిన అనంతరం రవి డీసీఎం స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్‌లో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
అత్తామామ వేధింపులు భరించలేక కోడలు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజాంసాగర్ మండలం ఆరేడులో జరిగింది. SI సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం స్వప్న అత్తామామలు ఆమెను కొన్ని రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వేధింపులు తాళలేక గురువారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో CM రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు. ★ ఆదిలాబాద్ జిల్లాతో నాకెంతో అవినాభావ సంబంధం ఉంది ★ ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు
★ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకుండా అవమానించిన BJP
★ అడవి బిడ్డలకు అండగా నిలబడిన మంత్రిగా సీతక్క
★ మూతబడిన CCI గురించి పట్టించుకోని మోదీ, కేసీఆర్ ★పదేళ్లు గిరిజనుల సమస్యలు పట్టించుకోని KCR.
Sorry, no posts matched your criteria.