India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో CM రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు. ★ ఆదిలాబాద్ జిల్లాతో నాకెంతో అవినాభావ సంబంధం ఉంది ★ ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు
★ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకుండా అవమానించిన BJP
★ అడవి బిడ్డలకు అండగా నిలబడిన మంత్రిగా సీతక్క
★ మూతబడిన CCI గురించి పట్టించుకోని మోదీ, కేసీఆర్ ★పదేళ్లు గిరిజనుల సమస్యలు పట్టించుకోని KCR.
BRS అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటలు నిషేధిస్తే BRS ప్రచార ప్రభంజనం ఆగదని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆమనగల్‌లో నిర్వహించిన బంజారా గర్జన సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. KCR తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అన్నారు. ఎన్నికల సంఘం పున:పరిశీలించి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.
ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె క్రిశాంక్ అరెస్ట్ అక్రమమని, కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. HYD బోయిన్‌పల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తలసాని.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను గెలిపించాలని కోరారు. BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు కింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ధన్వాడలో 45.1, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 44.8, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 44.6, వనపర్తి జిల్లా మదనపూర్ లో 44.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
HYD మెట్రో రైలు శుభవార్త చెప్పింది. ఈరోజు రా.1 గంట వరకు మెట్రో సేవలను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 12:15 గంటలకి చివరి ట్రైన్ ప్రారంభమై 1:10 గంటలకి గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. ఉప్పల్ స్టేడియం, NGRI స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఉప్పల్ మార్గంలో మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగేవారికి అనుమతి ఉంటుందని, ఎక్కడానికి వీలు ఉండదని సృష్టం చేసింది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముత్తంగి శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద గల స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగనప్పటికీ, భారీగా నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నల్గొండ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని గంట పాటు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, NLG పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
ట్యాంక్‌బండ్‌లో ఓ యువకుడి ప్రాణాలను GHMC DRF సిబ్బంది కాపాడారు. గురువారం ఉదయం అప్పర్ ట్యాంక్‌బండ్ మీదకొచ్చిన వంశీ అనే యువకుడు నీళ్లలోకి దూకాడు. మునిగిపోతున్న అతడిని గమనించిన DRF సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటినా ట్యాంక్‌బండ్‌లోకి దిగి అతడిని బయటకు తీసుకొచ్చారు. లేక్ పోలీసులకు అప్పగించారు. వ్యక్తిగత సమస్యల కారణంగా సూసైడ్‌కు యత్నించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.