Telangana

News May 2, 2024

బుగ్గారం: బీఆర్ఎస్‌కు రాజీనామా ఎంపీపీ, జడ్పీటీసీ

image

బుగ్గారం మండల MPP, ZPTC బాదినేని రాజమణి, రాజేందర్ గురువారం BRSకు రాజీనామా చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో కీలకనేతగా గుర్తింపు పొందిన రాజేందర్ రాజీనామా చేయడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ పిలుపు మేరకు అన్నికార్యక్రమాలు చేపట్టిన కూడా తమను అణచివేతకు గురిచేసి, చిన్నచూపు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేసినట్టు వివరించారు.

News May 2, 2024

హైదరాబాద్‌లో గన్‌ కలకలం

image

హైదరాబాద్‌లో నాటు తుపాకీ కలకలం రేపింది. జీడిమెట్ల‌లో గురువారం సైబరాబాద్ SOT పోలీసులు తనీఖీలు చేపట్టారు. ద్విచక్రవాహనదారుడిని ఆపి సోదాలు చేయగా రివాల్వర్‌తో పాటు 3 బులెట్లు లభ్యమయ్యాయి. నిందితుడు జీడిమెట్ల అయోధ్యనగర్‌‌లో నివాసం ఉంటున్న విశాల్(మధ్యప్రదేశ్‌ వాసి)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొన్నారు. ARMS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 2, 2024

NGKL: గొంతు కోసి భార్యను హత్య చేసిన భర్త

image

మద్యం మత్తులో అతి కిరాతకంగా భార్య గొంతు కోసి చంపిన ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాములు మద్యానికి బానిసై తరచూ జ్యోతితో గొడవ పడేవాడు. దీంతో ఉదయం కూడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో భార్య జ్యోతిని అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 2, 2024

హైదరాబాద్‌లో గన్‌ కలకలం

image

హైదరాబాద్‌లో నాటు తుపాకీ కలకలం రేపింది. జీడిమెట్ల‌లో గురువారం సైబరాబాద్ SOT పోలీసులు తనీఖీలు చేపట్టారు. ద్విచక్రవాహనదారుడిని ఆపి సోదాలు చేయగా రివాల్వర్‌తో పాటు 3 బులెట్లు లభ్యమయ్యాయి. నిందితుడు జీడిమెట్ల అయోధ్యనగర్‌‌లో నివాసం ఉంటున్న విశాల్(మధ్యప్రదేశ్‌ వాసి)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొన్నారు. ARMS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 2, 2024

తెలంగాణలో కాంగ్రెస్సే గాడిదగుడ్డు: బండి సంజయ్

image

రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని.. అందుకే గాడిద గుడ్డులో కూడా మోదీ కన్పిస్తున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రచారంలో భాగంగా సీఎం ఒక గుడ్డు పెట్టుకుని ప్రధాని గాడిద గుడ్డు ఇచ్చారని మాట్లాడుతున్నారన్నారు. పేదలకు రూ.2500 ఇస్తా అని మోసం చేశారని, రూ.4వేల పింఛన్ , తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణలో గాడిద గుడ్డుతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News May 2, 2024

‘కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు’

image

కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేశాడని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ తన పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నాడని, ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతోనే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. రఘురాంరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

News May 2, 2024

నల్గొండలో రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్ 

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నారు. తీన్మార్ మల్లన్న నామినేషన్ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.

News May 2, 2024

పాల్వంచలో వడదెబ్బతో వృద్ధురాలు మృతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు తోట భూ లక్ష్మి గురువారం వడదెబ్బతో మృతి చెందింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ అధికంగా ఉడడంతో ఎవరు దూర ప్రయాణాలు చేయవద్దని, చిన్న పిల్లలని బయట తిప్పవద్దని వైద్యులు కోరుతున్నారు.

News May 2, 2024

MBNR,NGKLలో అభ్యర్థులకు అందని ఓటర్ నాడీ

image

ఉమ్మడి జిల్లాలో అంతంతమాత్రంగా ప్రచారం ఉండటంతో ఓటరు నాడి అందడం లేదు.MBNR,NGKL లోక్ సభ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండటం ఆసక్తికరంగా మారింది.కేంద్రంలో అధికారాన్ని నిలుపుకోవటం కోసం BJP,ఎట్టకేలకు వచ్చిన అధికారంపై పట్టు సాధించాలంటే సత్తా చాటుకోవడం కాంగ్రెస్,పూర్వవైభవం తెచ్చుకోవడం కోసం BRS,ఈ పరిస్థితుల్లో ఓటరు గుంభనంగా ఉండటం పార్టీలకు ఎండవేడిమితో పాటు రాజకీయ ఉక్కపోత కల్పిస్తోంది.

News May 2, 2024

బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ.. తీసేసే పార్టీ కాదు: రఘునందన్ రావు

image

బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టియే, కానీ తీసేసే పార్టీ కాదని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు స్పష్టం చేశారు. గురువారం గజ్వెల్‌లోని కుకునూర్‌పల్లి మండల కేంద్రంలో రోడ్ షో‌కు హాజరై కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ బీజేపీపై బురదల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. స్వయంగా ప్రధాని మోదీ తన ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు తీసేయనని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.