Telangana

News May 2, 2024

ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం: BJP

image

‘ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం’ అంటూ @BJP4Telangana ట్వీట్‌ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి HYD MP అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా లాల్‌దర్వాజా BJP బహిరంగ సభలో ‌పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో‌లను షేర్ చేసిన బీజేపీ తెలంగాణ తన అధికారిక సోషల్ మీడియా ‘X’లో‌ ‘Hyderabad ❌ Bhagyanagar ✅’ అని రాసుకొచ్చింది. దీనిపై మీ కామెంట్?

News May 2, 2024

WGL: అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఎంపికైన యోగేశ్వర్

image

వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన తిప్పాటి యోగేశ్వర్ అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. గతేడాది అక్టోబర్‌లో షిరిడీలో జరిగిన జాతీయ క్రీడల్లో యోగేశ్వర్ ప్రతిభ కనబర్చారు. త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా టార్గెట్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి రవికుమార్ తదితరులు అభినందించారు.

News May 2, 2024

నేతలకు గుర్తుల గుబులు

image

2019 BHNR లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5 వేల ఓట్ల మెజార్టీతో గెలవగా..ఇక్కడ కారును పోలిన రోడ్డు రోలర్‌ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి ఏకంగా 25 వేల ఓట్లు వచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. ప్రస్తుతం చపాతి రోలర్‌, రోడ్డు రోలర్‌ గుర్తులను కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది.

News May 2, 2024

నాలుగు, ఐదు తేదీల్లో హోమ్ ఓటింగ్: కలెక్టర్

image

ఈ నెల 4, 5తేదీలలో హోమ్ ఓటింగ్ నిర్వహించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 85 సంవత్సరాలు పైబడిన 181 మంది వృద్ధులు, 258 మంది వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 25 ప్రత్యేక హోమ్ ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేసి, 12 రూట్ల ద్వారా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు.

News May 2, 2024

వరంగల్: పెరిగిన పత్తి ధర

image

బుధవారం మేడే సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కాగా.. పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం మంగళవారంతో పోలిస్తే ఈరోజు రూ. 45 పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. ఈరోజు రూ.7,105కి చేరినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News May 2, 2024

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ‘కాంగ్రెస్‌దే పై చేయి’

image

ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా.. నాగర్ కర్నూల్ సెగ్మెంట్‌ను ఎస్సీలకు రిజర్వు చేశారు. 1952, 1957లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న నాగర్ కర్నూల్ 1962 నుంచి లోక్ సభ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా తొమ్మిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, నాలుగు సార్లు టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులు గెలుపొందారు.

News May 2, 2024

భద్రాచలం వద్ద గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం 

image

భద్రాచలం వద్ద గోదావరిలో తెలియని మృతదేహం గురువారం ఉదయం కొట్టుకు వచ్చింది. స్నానాలు రేపు వద్ద ఒడ్డుకు మృతదేహం కొట్టుకు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

ELECTION’S: ఆదిలా’బాద్ షా ఎవరు..?

image

రాష్ట్రంలో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నది ఆదిలాబాద్ జిల్లా. ఇది మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో విభిన్న తెగలకు చెందిన ప్రజలు ఉంటారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 లక్షల 44 ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, BRS, BJP పోటీ చేయగా, ముగ్గురు టీచర్లే. ఈ తరుణంలో ఆదిలాబాద్ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్‌లో అడుగుపెట్టేది ఎవరో కామెంట్ చేయండి.

News May 2, 2024

MBNR: బ్యాటరీ కంపెనీ బాధితులకు డీకే అరుణ మద్దతు

image

మహబూబ్ నగర్ ఐటీ పార్క్ పరిధిలో నెలకొల్పిన అమర రాజా లిథియం బ్యాటరీ కంపెనీని ఎత్తి వేయాలని ప్రజలు చేపట్టిన నిరసన దీక్షకు బీజేపీ పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ బుధవారం రాత్రి తన మద్దతు ప్రకటించారు. దివిటిపల్లి, సిద్దయ్యపల్లి, ఎదిర, అంబట్ పల్లి గ్రామల ప్రజలు ఈ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఎదిర గ్రామ కేంద్రంగా గత 49 రోజులుగా శాంతియుత నిరసన దీక్ష చేస్తున్నారు. కాలుష్య పరిశ్రమ వద్దు అంటున్నారు.

News May 2, 2024

MEDAK: లోక్‌సభ బరిలో 130 మంది

image

ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్‌, జహీరాబాద్‌, కరీంనగర్‌, భువనగిరి పార్లమెంట్‌ స్థానాల్లో 130 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలో 44 మంది, జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో 19 మంది, కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో 28 మంది, భువనగిరి పార్లమెంట్‌ స్థానంలో 39 మంది పోటీలో ఉన్నారు.