Telangana

News May 2, 2024

సిద్దిపేట: ప్రచారానికి మిగిలింది… ఇంకా 10 రోజులే

image

మెదక్ లోకసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా పదిరోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు . ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరికి వారు ధీమాగా ప్రచారాన్ని ఉధృతం చేశారు.

News May 2, 2024

HYD: B.Tech చేసిన వారికి ఉద్యోగాలు

image

బాలానగర్ వద్ద ఉన్న HAL(హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ.. అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్, మెకానిక్ విభాగాలలో B.Tech ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు. ఆన్‌లైన్ ద్వారా ఆసక్తి గలవారు మే 8 వరకు https://www.hal-india.co.inవెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT

News May 2, 2024

HYD: B.Tech చేసిన వారికి ఉద్యోగాలు

image

బాలానగర్ వద్ద ఉన్న HAL(హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ.. అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్, మెకానిక్ విభాగాలలో B.Tech ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు. ఆన్‌లైన్ ద్వారా ఆసక్తి గలవారు మే 8 వరకు https://www.hal-india.co.inవెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
SHARE IT

News May 2, 2024

ఖమ్మం: పత్తి, మిర్చి ధరల వివరాలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. నాన్ ఏసీ మిర్చి క్వింటా ధర 19050, పత్తి క్వింటా 7100 ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు. మొన్నటికంటే పత్తి ధర 100 రూపాయల దగ్గగ , మిర్చి ధర 400 రూపాయలు పెరిగింది. మిర్చి 500 నుండి 1000 రూపాయల హెచ్చుతగ్గుల మధ్య ధరలు కొనసాగుతున్నాయి.

News May 2, 2024

ఎండలతో భగ్గుమంటున్న భద్రాద్రి జిల్లా

image

నాలుగు రోజులుగా ఎండలు భగభగ మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి భానుడు ప్రభావం చూపిస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని చుంచుపల్లిలో రికార్డుస్థాయిలో 46.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో జిల్లాలో ఇదే అత్యధికం. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News May 2, 2024

వరంగల్: పెళ్లికావడంలేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గ్రేటర్ వరంగల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16వ డివిజన్ ధర్మారానికి చెందిన ఆటోడ్రైవర్ గోదాసి రజనీకాంత్(28) పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో ఏప్రిల్ 24న పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని తెలిపారు.

News May 2, 2024

సిద్దిపేటను అవమానించిన సీఎం రేవంత్‌: హరీశ్‌రావు

image

సిద్దిపేట అంటే సీఎం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచి చిన్న చూపేనని మాజీ మంత్రి, సిద్దిపేట MLA హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నిక ఓట్లు, సీట్లు, అధికారం కోసం జరిగేది కాదని తెలంగాణ భవిష్యత్‌ కోసం జరిగే ఎన్నిక అన్నారు. తెలంగాణ తెచ్చింది మన సిద్దిపేట బిడ్డ KCR‌ అని, అలాంటి KCRను సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన తిడుతున్నాడని, కేసీఆర్‌ను తిట్టడం అంటే మన సిద్దిపేట ప్రజలను అవమాన పర్చడమే అన్నారు.

News May 2, 2024

మంచిర్యాల: తాండూరు SI సస్పెండ్

image

తాండూరు SI జగదీశ్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 IG రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన మల్టీ జోన్-1 IG PDS రైస్ కేసులపై సమీక్ష నిర్వహించారు. గత నెల 20న తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన PDS బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష జరిపారు. ఈ కేసులో SI జగదీశ్ అలసత్వం పాటు, పలు ఆరోపణలు రావడంతో SIని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఐజీ వెల్లడించారు.

News May 2, 2024

నిజామాబాద్: కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య

image

కడుపు నొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని పెద్దమ్మ తల్లి రోడ్డుకు చెందిన అరుణ్ రావు(47) కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నొప్పి ఎక్కువ కావడంతో రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

News May 2, 2024

MBNR: పార్లమెంట్ ఎన్నికలు.. పది రోజులే కీలకం.!

image

పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఈ పది రోజులే కీలకంగా కానున్నాయి. ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి ప్రచారాల్లో ఉన్న అభ్యర్థులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ పది రోజులు కీలకం కావడంతో అభ్యర్థులు తమ ప్రచార జోరును పెంచి ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. ఈ కొన్ని రోజుల ప్రచారాలు మరో ఎత్తుగా సాగనుంది.