Telangana

News May 2, 2024

నల్గొండ: వడదెబ్బతో మహిళ మృతి

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బతో చిట్యాలకు చెందిన గోగికారి యాదమ్మ అనే మహిళ మృతి చెందింది. కాగా రెండు రోజుల క్రితమే శాలిగౌరారం మండలం పెర్కకొండారానికి చెందిన అనిల్ కుమార్ వడదెబ్బతో చనిపోయాడు. రాబోయే రెండు రోజులు ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుందని అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. 

News May 2, 2024

HYD: అమ్మాయి‌ పేరుతో నగ్న చిత్రాలు.. ARREST

image

అమ్మాయిల పేరుతో మోసగిస్తున్న యువకుడిని CYB సైబర్‌క్రైమ్‌ అరెస్టు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన దినేశ్‌.. బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటుపడ్డాడు. ఈజీ మనీ కోసం డేటింగ్‌ యాప్‌‌లో యువతి ఫొటోలు పెట్టి అకౌంట్ తెరిచాడు. యువకులతో అమ్మాయిలా చాటింగ్ చేస్తూ, నగ్న చిత్రాలు పంపుతూ డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు దినేశ్‌‌ను అరెస్ట్ చేశారు.

News May 2, 2024

HYD: అమ్మాయి‌ పేరుతో నగ్న చిత్రాలు.. ARREST

image

అమ్మాయిల పేరుతో మోసగిస్తున్న యువకుడిని CYB సైబర్‌క్రైమ్‌ అరెస్టు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన దినేశ్‌.. బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటుపడ్డాడు. ఈజీ మనీ కోసం డేటింగ్‌ యాప్‌‌లో యువతి ఫొటోలు పెట్టి అకౌంట్ తెరిచాడు. యువకులతో అమ్మాయిలా చాటింగ్ చేస్తూ, నగ్న చిత్రాలు పంపుతూ డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు దినేశ్‌‌ను అరెస్ట్ చేశారు.

News May 2, 2024

మహబూబాబాద్: లైంగిక వేధింపుల కేసులో జైలుశిక్ష

image

డోర్నకల్ పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన ఓ బాలికపై 2023 అక్టోబర్ 4న తేజావత్ రమేష్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సీఐ ఉపేందర్, ఎస్సై ఝాన్సీ తేజావత్ రమేష్ పై కేసునమోదు చేశారు. తేజావత్ రమేష్ కు ఐదు సంవత్సరాల మూడు నెలల జైలుశిక్ష, రూ.11వేల జరిమానాను విధించినట్లు న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పునిచ్చారు.

News May 2, 2024

నేతలకు గుర్తుల గుబులు

image

2019 BHNR లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5 వేల ఓట్ల మెజార్టీతో గెలవగా..ఇక్కడ కారును పోలిన రోడ్డు రోలర్‌ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి ఏకంగా 25 వేల ఓట్లు వచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. ప్రస్తుతం చపాతి రోలర్‌, రోడ్డు రోలర్‌ గుర్తులను కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది.

News May 2, 2024

మెదక్: వ్యక్తి మిస్సింగ్.. అస్థిపంజరం లభ్యం

image

మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో అదృశ్యమైన చుక్క కృష్ణ(55) ఆత్మహత్య చేసుకోగా అస్థిపంజరం లభించినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇంట్లో గొడవపడి ఫిబ్రవరి 11న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు ఇలాగే వెళ్లి వస్తుండడంతో ఇంట్లోవాళ్లు నాలుగైదు రోజులు ఎదురుచూశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గ్రామ సమీపంలోని అటవీలో ఉరేసుకోగా అస్థిపంజరంగా గుర్తించారు.

News May 2, 2024

జనగామ: వడదెబ్బతో వ్యక్తి మృతి

image

ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా జనగామ పట్టణం గుండ్లగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్ మోహినొద్దిన్ (52) రోజువారీ కూలిపనిలో భాగంగా బుధవారం బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఎండ తీవ్రతకు గురై సాయంత్రం ఇంటికి వచ్చి కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన జనగామ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News May 2, 2024

వడదెబ్బకు మాజీ వార్డు సభ్యులు కంపాటి మృతి

image

ములకలపల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన సీపీఐ నాయకులు, మాజీ వార్డు సభ్యులు కంపాటి పుల్లయ్య వడదెబ్బకు మృతిచెందారు. వాంతులతో కళ్లుతిరిగి పడిపోవడంతో కుటుంబసభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందారు. మృతదేహాన్ని సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు నరాటి ప్రసాద్, మండల కార్యదర్శి ఎండి. యూసఫ్, నాయకులు నరాటి రమేష్, అనుముల సాయి, సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

News May 2, 2024

ఆస్తి పన్ను వసూలులో నల్గొండ టాప్

image

ఐదు శాతం రాయితీ అవకాశాన్ని నకిరేకల్ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. అక్కడ 51 శాతం ఆస్తి పన్ను వసూలైంది. చండూరు మున్సిపాలిటీలో మాత్రం అతి తక్కువ మంది ఆస్తి పన్ను చెల్లించారు. నల్గొండలో రూ.6,66,66,000, మిర్యాలగూడలో రూ.2,51,87,000, దేవరకొండలో రూ.63,35,867, చండూరులో రూ.12లక్షలు, చిట్యాలలో రూ.56లక్షలు, హాలియాలో రూ.5,49,55,000, నకిరేకల్లో రూ.2.66 కోట్ల ఆస్తి పన్ను వసూలు అయ్యింది.

News May 2, 2024

నిజామాబాద్: RTC బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

image

RTC బస్సు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మయాపూర్‌కి చెందిన సాయిలు బుధవారం రోజు వారీ పనికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బాద్గుణ గ్రామం నుంచి నందిపేట వెళ్తున్న RTC బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో సాయిలు తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ను అదుపులో తీసుకుని ఎస్ఐ కేసు నమోదు చేసని దర్యాప్తు చేస్తున్నారు.