Telangana

News July 20, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ విడుదల: చనగాని
✓సికింద్రాబాద్: లష్కర్ బోనాలకు సీఎం, డిప్యూటీ సీఎంకు ఆహ్వానం ✓గోల్కొండ అమ్మవారి హుండీ ఆదాయం రూ.3,91,205
✓శంషాబాద్:యువకుడి అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు
✓బాలాపూర్:సీఎం 30 వేల ఉద్యోగాలిచ్చారు:KLR
✓ఖైరతాబాద్: శరవేగంగా 70 అడుగుల గణపయ్య విగ్రహ పనులు
✓HYD-బీజాపూర్ హైవే విస్తరణకు లైన్ క్లియర్

News July 20, 2024

త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల: డిప్యూటీ సీఎం

image

త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండానే పోటీ పరీక్షలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా, నేడు డిప్యూటీ సీఎం సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో పరీక్షల రద్దుపై చర్చించారు.

News July 20, 2024

ప్రతి కేసుపై పారదర్శక విచారణ: ఎస్పీ

image

ప్రతీ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించారు. ఆయా కేసులకు సంబంధించి అధికారులు సేకరిస్తున్న ఆధారాలను పరిశీలించారు. సమవేశంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి ఉన్నారు.

News July 20, 2024

HYD: సాఫ్ట్‌వేర్‌ కోర్సులకు ఆన్‌లైన్‌లో శిక్షణ

image

నేషనల్ స్కిల్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మణికొండలోని సమస్త కార్యాలయంలో ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.
SHARE IT

News July 20, 2024

వర్షా కాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

image

వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. డీఆర్డీఓ, డీపీఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది గ్రామాల్లో సర్వేలు నిర్వహించాలని మంత్రి సీతక్క కోరారు.

News July 20, 2024

కరీంనగర్: ‘కష్టపడి పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయండి’

image

కష్టపడి పని చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయండని, పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూసి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సిపి, ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని, ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.

News July 20, 2024

అధికారులు పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి: మంత్రి జూప‌ల్లి

image

మ‌హిళా స‌మాఖ్య‌, రైతులు, స్థానిక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మంత్రి జూపల్లి చ‌ర్చించారు. వీప‌న‌గండ్ల మండలంలోని వివిధ అంశాల‌పై అధికారుల‌తో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు విస్తృత‌ స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. బీఆర్ఎస్ పాల‌న‌లో గాడి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ను బాగు చేయ‌డానికి కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. అవినీతికి తావు లేద‌నే సందేశం పైస్థాయి నుంచి కింది స్థాయి వ‌ర‌కు వెళ్లాల‌న్నారు.

News July 20, 2024

SRD: ‘భారీ వర్షాలు.. ప్రజలను అప్రమత్తం చేయండి’

image

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం లో తెలిపారు. వరదల వల్ల నష్టం జరగకుండా అధికారులు మందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు అందుబాటులో ఉండాలని చెప్పారు. చెరువు కట్టలు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

News July 20, 2024

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి: కలెక్టర్ క్రాంతి

image

అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్ల ముందు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.

News July 20, 2024

నేడు బిక్కనూర్ మండలానికి మంత్రి జూపల్లి

image

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు బిక్కనూర్ మండలంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలో నిర్వహించే రైతు సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.