Telangana

News September 6, 2024

గణేశ్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి: అడిషన్ కలెక్టర్

image

గణేశ్ నవరాత్రులు ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ రోడ్ల మరమ్మత్తు విషయంలో ఉత్సవ కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురాగా వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు. మండపాల నిర్వహకులు పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించాలన్నారు.

News September 6, 2024

MBNR: విద్యుత్ సిబ్బంది లంచం అడిగితే ఫిర్యాదు చేయండి..

image

విద్యుత్ సిబ్బంది ఏదైనా పనికి లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని విద్యుత్తు సంస్థ సీఎండి శుక్రవారం ముషారఫ్ ఫరుఖీ తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు సంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది గానీ అధికారులు కానీ ఏదైనా పనికి లంచం అడిగితే 040-23454884, 7680901912 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు శ్రీకారం చుట్టారు.

News September 6, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. గద్వాల జిల్లా కోదండపూర్‌లో 104.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 89.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 76.3 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 64.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా జడ్ప్రోలు లో 55.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది.

News September 6, 2024

వేములవాడ: 24 గంటల్లో 23 ఆపరేషన్లు

image

సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయి. 24 గంటల్లో 23 ఆపరేషన్లు చేసి దవాఖాన సత్తా చాటారు.  కార్పొరేట్‌కు దీటుగా ముందుకు సాగుతున్నారు. ఆసుపత్రిలో గత 24 గంటల్లో మరోసారి రికార్డు స్థాయిలో వివిధ రకాల 23 ఆపరేషన్లు అయ్యాయి. ఇందులో 10 డెలివరీలు, 2 గర్భసంచిలో గడ్డ, 5 సాధారణ శస్త్ర చికిత్సలు, 1 కంటి ఆపరేషన్, 5 ఆర్తో ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు.

News September 6, 2024

HYD: హిందూ యువతపై అక్రమ కేసులెందుకు ?: బండి

image

జైనూరు ఘటనలో బాధితురాలని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. మహిళ ముఖంపై ఉన్న గాయాలు చూసి మనసు చెలించిపోయిందని మంత్రి అన్నారు. మహిళ ప్రాణాల కంటే, ఓవైసీ పర్నిచర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని, హిందూ యువతపై ఘర్షణ పేరిట అక్రమ కేసులు ఎందుకు బనాయిస్తున్నారని? ప్రశ్నించారు.

News September 6, 2024

HYD: 2036 నాటికి ట్రిలియన్ డాలర్లకు రాష్ట్ర GSDP

image

తెలంగాణ స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (GSDP) 2036 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని ప్రపంచ వాణిజ్య కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం GSDP 176 బిలియన్‌ డాలర్లుగా ఉందని, వచ్చే 12 ఏళ్లలో అది భారీగా వృద్ధి చెందుతుందని వెల్లడించింది. HYDలో జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధ (AI) సదస్సు సందర్భంగా నిన్న విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయం వెల్లడించింది.

News September 6, 2024

రైతు సురేందర్ రెడ్డికి హరీశ్‌రావు నివాళి

image

మేడ్చల్‌లో ఆత్మహత్య చేసుకున్న దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి మృతదేహానికి ఈరోజు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు,సబితా ఇంద్రారెడ్డి, తలసాని, సునీతాలక్ష్మారెడ్డి, ముఠాగోపాల్, మల్లారెడ్డి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని,ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

News September 6, 2024

HYD: రైతు సురేందర్ రెడ్డికి హరీశ్‌రావు నివాళి

image

మేడ్చల్‌లో ఆత్మహత్య చేసుకున్న దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి మృతదేహానికి ఈరోజు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు,సబితా ఇంద్రారెడ్డి, తలసాని, సునీతాలక్ష్మారెడ్డి, ముఠాగోపాల్, మల్లారెడ్డి నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని,ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

News September 6, 2024

శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్

image

ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. దీంతో అధికారులు శుక్రవారం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,33, లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది. స్పిల్ వే ద్వారా 55.874 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

News September 6, 2024

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సీతక్క

image

గిరిజన సంక్షేమ పాఠశాలలు, గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పోషకాహారాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పలువురు అధికారులతో సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.