India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
> మల్కాజిగిరి డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం
> మహంకాళి పీఎస్ పరిధిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
> దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం.. ఎంబీఏ విద్యార్థి మృతి
> నగర వ్యాప్తంగా మే డే వేడుకలు
> కాచిగూడలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
> అక్రమంగా ఆక్సీ టాక్సిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
> బంజారాహిల్స్‌లోని ఓ సెలూన్‌లో అగ్నిప్రమాదం
> నగర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు భద్రాచలం ఎమ్మెల్యే నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.
ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, గ్రీన్ హిల్స్, బండ్లగూడ, హయత్ నగర్, ఆటోనగర్, శాంతినగర్ కరెంటు సంబంధిత సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారికి తెలియజేయాలని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారుల నెంబర్లను తెలిపి, అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. స్థానికంగా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ తమ లెక్కలోనే లేరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. జానారెడ్డి అదృష్ట వంతుడని.. ఒక కొడుకు ఎమ్మెల్యే.. మరో కొడుకు భారీ మెజార్టీతో ఎంపీగా గెలువబోతున్నారని జోస్యం చెప్పారు.
పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట డివిజన్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా నేడు ప్రచారం నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపీగా లక్ష ఓట్ల మెజారిటీతో ఆమెను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిదని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షింస్తూ DCC కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరెట్ శక్తులకు దోచి పెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్‌ను ప్రధాని చేయాలన్నారు.
త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికలు మనకు ఫైనల్స్ లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శేర్లింగంపల్లి తారా నగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. RIMS ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న రాథోడ్ మహేందర్ డ్యూటీ ముగించుకుని బుధవారం నేరడిగొండ మండలంలోని తన స్వగ్రామానికి బైక్ పై బయల్దేరాడు. ఈ క్రమంలో NH44 దూద్ గండి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని చెరువు కట్టపై ధాన్యం బస్తాలతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న రైతు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ బెడ్ రూం సర్వీసు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు శివానంద్‌ను MBA విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అతివేగంగా ప్రయివేట్ బస్సును వెనుక నుండి బైక్ తో ఢీ కొట్టడంతో చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.