Telangana

News July 20, 2024

ఆదిలాబాద్: ధరణి ఆపరేటర్లకు స్థానచలనం

image

ADB జిల్లా వ్యాప్తంగా 18 మంది ధరణి అపరేటర్లకు స్థానచలనం కల్పించారు. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను ఎట్టకేలకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయా మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో చేరాలని ఆదేశించారు. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కొందరిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తారని అంతా భావించినా.. పక్క మండలానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.

News July 19, 2024

సికింద్రాబాద్‌ బోనాలకు స్పెషల్ బస్సులు

image

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21, 22న జరగనున్న విషయం తెలిసిందే. అమ్మవారి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి TGRTC ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రేటర్‌లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ MD సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT

News July 19, 2024

సికింద్రాబాద్‌ బోనాలకు స్పెషల్ బస్సులు

image

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21, 22న జరగనున్న విషయం తెలిసిందే. అమ్మవారి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి TGRTC ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రేటర్‌లోని 24 ప్రాంతాల నుంచి 175 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ MD సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

News July 19, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి ముఖ్యాంశాలు

image

◆ త్వరలో ఆదిలాబాద్‌లో రేవంత్ రెడ్డి పర్యటన
◆ జైనూర్: భారీగా గుట్కా పట్టివేత
◆ భైంసా: కోతికి అంత్యక్రియలు
◆ మంచిర్యాల: చోరీకి పాల్పడిన ముగ్గురు అరెస్ట్
◆ తలమడుగు: పురుగుల మందుతాగి యువకుడు మృతి
◆ పెంచికల్ పెట్ : రోడ్డుపై చేపలు పడుతూ నిరసన
◆ దిలావార్పూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
◆ ఆదిలాబాద్: ప్రాజెక్టులకు జలకళ
◆ పలు చోట్ల ఉప్పొంగిన వాగులు, వంకలు
◆ రెబ్బెన: డ్రంక్ అండ్ డ్రైవ్

News July 19, 2024

మంచిగా చదవి ఉన్నత శిఖరాలకు ఎదగాలి: OSD

image

విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని OSD మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలోని ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మొదటి సంవత్సర విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నాలుగవ సెమిస్టర్ లో మంచి మార్కులు సాధించి మంచి ఉద్యోగం చేయాలని, అదే అధ్యాపకులకు ఇచ్చే గురుదక్షిణ అని అన్నారు. ప్రిన్సిపల్ చంద్ర కిరణ్, అధ్యాపకులు పాల్గొన్నారు.

News July 19, 2024

రైతుల సూచనలతో రైతు భరోసాపై నిర్ణయం: మంత్రి తుమ్మల

image

తెలంగాణలోని రైతులందరి సూచనలు, అభిప్రాయాలను క్రోడీకరించి రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతు భరోసా పథకం అమలుపై ఉమ్మడి జిల్లాలోని రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.

News July 19, 2024

SRPT: ‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. కలెక్టరేట్లో మెడికల్ ఆఫీసర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతి మెడికల్ ఆఫీసర్ ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో సిజేరియన్ సెక్షన్లు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, అనుమతులను రద్దు చేస్తామని అన్నారు.

News July 19, 2024

నల్గొండ: కూల్ డ్రింక్ ఇచ్చి.. మహిళ మెడలో బంగారం చోరీ

image

మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లిన ఘటన పీఏ పల్లి మండల పరిధిలోని మల్లాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన గన్నేబోయిన ముత్యాలమ్మ గ్రామ శివారులో పంట పొలంలో పనిచేస్తుంది. అక్కడికి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి తెలిసిన వ్యక్తిలా పరిచయం చేసుకుని కూల్ డ్రింక్ తాగమని ఇచ్చాడు. డ్రింక్ తాగుతుండగా రాయితో ఆమె తలపై కొట్టి బంగారం లాక్కెళ్లినట్లు SI నర్సింహులు తెలిపారు.

News July 19, 2024

నిజామాబాద్: లాడ్జీలలో పోలీసుల తనిఖీలు

image

నగరంలోని లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లాడ్జీలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా వాటిని నిరోధించడానికి ఈ తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, టౌన్ సీఐ నరహరి, మహిళా సీఐ శ్రీలత, నాలుగవటౌన్ ఎస్ఐ పాండేరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

News July 19, 2024

KTDM: వాగులో చేపలకు వెళ్లి మరో వ్యక్తి గల్లంతు

image

 పోలవరం సమీపంలో ఉన్న పాల కాలువలో శుక్రవారం గిరిజనుడు గల్లంతయ్యాడు. వెలమలకోటకి చెందిన వెంకన్న దోర (40) చేపలు పడుతుండగా వాగులో ఒక్కసారిగా వరద ఉద్ధృతికి పెరగడంతో కొట్టుకు పోయాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.