India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీలు జీతాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇంత వరకు జీతాలు చెల్లించలేదన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్లో 24 రోజులు సమ్మె చేశామని.. ఆ కాలానికి సంబంధించిన వేతనాలు కాంగ్రెస్ చెల్లిస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం మేడే కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల జీవితాలలో నేటికీ పురోగతి లేదన్నారు. దీనికి గత పాలకులే కారణం అన్నారు. కార్మికుల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసి వారిని సన్మానించారు.
శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో తిరుగుతున్న చిరుతను పట్టుకునేందుకు నాలుగు రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు 25 కెమెరాలు, 5 బోన్లలో మేకలను ఏర్పాటు చేశారు. అయినా కూడా బోను దగ్గరికి వచ్చిన చిరుత తిరిగి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో చిరుతను పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు అన్నారు.
అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కార్మికుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దుబ్బాక జూనియర్ సివిల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వేముగంటి తరణి అన్నారు. బుధవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హబ్సిపూర్ శివారులో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో పాల్గొన్నారు.
దిశా కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై హైకోర్టు సింగిల్ బెంచ్‌ను పలువురు అధికారులు ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై స్టే విజయసేన్ రెడ్డి బెంచ్ విధించింది. పోలీసుల పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

HYD మెట్రో, MMTS రైళ్లు, ప్రదర్శనలు, వినోద కార్యక్రమాల్లో మఫ్టీలోని షీ టీమ్స్ నిఘా కళ్లు పోకిరీలను వెంటాడుతున్నాయి. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో 14 బృందాలు మఫ్టీలో నిత్యం పహారాకాస్తున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో మఫ్టీలో ఉంటున్న ఈ బృందాలు దూరంగా ఉండి ఆకతాయిల చేష్టలను వీడియో రికార్డ్ చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆకతాయిలకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ అందిస్తున్నారు.

పాలిసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు ఈనెల 7 వరకు పెంచినట్లు సంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500 ఆన్ లైన్ ద్వారా చెల్లించాలని చెప్పారు. మే 24న ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పదవ తరగతి చదివిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎన్నికల నిర్వహణలో పీవో, ఏపీవో, ఓపిలోల పాత్ర ఎంతో కీలకమని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పాలేరు, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పీవో, ఏపీవో, ఓపిలో లకు చేపట్టిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణలో వీరి పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా వారి సలహాలు సూచనలు చేసారు.
Sorry, no posts matched your criteria.