India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గల చెక్ డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు గౌరారం పోలీసులు తెలిపారు. సుమారు 35ఏళ్ల వయసు కలిగి ఉన్న మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వివరించారు. హల్దీవాగులో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
ఫారుక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గ్రామ సమీపంలోని మజీద్ వెనకాల ఉన్న రైల్వే ట్రాక్ పై పడి ఉన్న మృతుడి వయసు 55 నుంచి 60ఏళ్లు ఉంటుందని, అతను తెల్లటి బనియన్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జీహెచ్ఎంసీ డ్రైవర్ రామ్ చంద్ర యాదవ్(25) పై కాచిగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. నింబోలి అడ్డకు చెందిన రామచంద్ర యాదవ్ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జీహెచ్ఎంసీ డ్రైవర్ రామ్ చంద్ర యాదవ్(25) పై కాచిగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. నింబోలి అడ్డకు చెందిన రామచంద్ర యాదవ్ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
టెన్త్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉ.9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్కు 15రోజుల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్సర్ షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలన్నారు.
కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గూడూరి శివకుమార్ బుధవారం రావి ఆకుపై కార్మికుల లోగో చిత్రాలను గీసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక దినోత్సవం దాని మూలాలను కార్మిక సంఘం ఉద్యమంలో కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు రావి ఆకుపై లేబర్ల వృత్తి ఆయుధాలైన కొడవలి, సుత్తి, పాన చిత్రాలను సూచిస్తూ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో మే నెల ప్రారంభానికి ముందునుంచే సూర్యుడు సుర్రుమంటుండు. తాజాగా జిల్లాలో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలులు, ఉక్కపోత ఠారెత్తిస్తున్నాయి. మరో మూడు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని అంటున్నారు.
పాలమూరు యూనివర్సిటీకి చెందిన హ్యాండ్ బాల్ పురుషుల క్రీడాకారులు బుధవారం కేరళ రాష్ట్రానికి బయలుదేరారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ క్రీడలు ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు కేరళలో నిర్వహించనున్నారు. ఈ క్రీడాకారులకు పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్, పిడి శ్రీనివాసులు ట్రాక్ షూట్స్, యూనిఫార్మ్స్ అందజేశారు. క్రమశిక్షణతో క్రీడలు ఆడి తల్లిదండ్రులు, యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల విధుల కోసం నియమించిన సిబ్బందికి ఈ నెల 2 నుంచి 4 వరకు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.
రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శాయంపేట మండలానికి చెందిన తేజేశ్వర్ వరంగల్ మెడికేర్ హాస్పిటల్ వద్ద ట్రైన్ కింద పడి మరణించారు. కులాంతర వివాహం చేసుకొన్న తేజేశ్వర్.. భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.