India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ సంఘటన ఛత్రినాక PS పరిధిలో చోటుచేసుకుంది. సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ ఉర్ రెహమాన్ ఎలక్ట్రీషియన్. 2021లో అతడు ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తాజాగా కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది.
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ సంఘటన ఛత్రినాక PS పరిధిలో చోటుచేసుకుంది. సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ ఉర్ రెహమాన్ ఎలక్ట్రీషియన్. 2021లో అతడు ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తాజాగా కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది.
సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. SBIREWARDS కానీ లేదా SBI పేరు మీద ఉన్న ఎటువంటి లింక్లను, APPలను ఎవ్వరూ క్లిక్ చేయవద్దన్నారు. అలా క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని, మీ అకౌంట్స్ నుంచి డబ్బులు పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. కావున ఎవ్వరూ SBI అని ఉన్న లింక్ పైన క్లిక్ చేయోద్దని ఎస్పీ సూచించారు.
నిన్న, మొన్నటి వరకు ఖమ్మంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ పర్యటన, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని సంకేతాలు కనిపిస్తున్నాయి. BRS అభ్యర్థి నామా, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, BJP తాండ్ర వినోద్ రావు మధ్య రసవత్తర పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు ‘మే డే’ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రామిక జనుల విజయ స్ఫూర్తిని చాటే ‘మే డే’ సందర్భంగా.. తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు. మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు. మీకు శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నానంటూ తెలిపారు.
కోరుట్ల శివారులో నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు, సీనియర్ నాయకులు కృష్ణారావు, కొమిరెడ్డి కరంచంద్, తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం సభలో పాల్గొన్న సీఎం.. ముందుగా కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు.
బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన రఘురాం రెడ్డిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేశామన్నారు.
లోకసభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీలో ఎవరో ఒకరు నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మే 7-8 తేదీల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వారిలో ఒకరు వస్తారని ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం వచ్చిందంటున్నారు. ఈ మేరకు నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాకు మధ్యలో ఉండే ఆర్మూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో నేతలు ఉన్నారు.
వరంగల్ నగరంలోని కరీమాబాద్ జన్మభూమి జంక్షన్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే విష్ణువర్ధన్(23) అనే యువకుడు క్రెడిట్ కార్డుపై చేసిన అప్పులు తీర్చలేక ఈరోజు తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.
మాజీ సీఎం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తాను, ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థి రఘురాంరెడ్డి కేంద్రానికి పోస్ట్ కార్డు రాశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మాజీ సీఎంలు ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పుడు జీవించే ఉంటారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు మద్దత్తు ఇచ్చారని ఇప్పుడు కూడా ఇవ్వాలన్నారు.
Sorry, no posts matched your criteria.