India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 44.9, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 44.8, వనపర్తి జిల్లా కేతేపల్లి లో 44.8, మహబూబ్ నగర్ జిల్లా వడ్డేమాన్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీకి చెందిన కాసర వేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. రాజయ్య-లక్ష్మి దంపతుల నలుగురు సంతానంలో రవి చిన్నవాడు. పిన్న వయసులోనే పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ సంఘం సీకాసకు ఆకర్షితుడై 1991ప్రాంతంలో విప్లవ బాట పట్టాడు. సింగరేణి కోల్ బెల్టులో చాలాకాలం పనిచేసి దండకారణ్యానికి బదిలీ అయ్యారు. రవి తుది శ్వాస వరకు విప్లవ మార్గాన్ని వీడలేదు.
SRD: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 1000 మార్కులకు 993 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాదించిన మెహ్రీన్ సుల్తానాను రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. సంగారెడ్డిలోని తన నివాసంలో మెహ్రీన్ సుల్తానా తండ్రి మహమ్మద్ సుజాయత్ అలీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు చిరుత చిక్కింది. 4 రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు 25 కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఓ బోన్ ముందు చిరుత సంచరిస్తున్న ఫొటోలు లభ్యమయ్యాయి. గొల్లపల్లి, రషీద్‌గూడ, బహదూర్‌గూడ, చిన్న గోల్కొండ ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. బీ కేర్ ఫుల్. SHARE IT
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలానికి చెందిన జక్కుల సంపత్, కృష్ణాపురానికి చెందిన బోడ విక్రమ్ ఇద్దరు కలిసి పశువుల వ్యాపారం చేసేవారు. ఓ విషయంలో ఇరువురి మధ్య గొడవ తలెత్తడంతో విక్రమ్ సంపత్‌ను హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటనలో విక్రమ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ రాజు వివరించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు చిరుత చిక్కింది. 4 రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు 25 కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఓ బోన్ ముందు చిరుత సంచరిస్తున్న ఫొటోలు లభ్యమయ్యాయి. గొల్లపల్లి, రషీద్‌గూడ, బహదూర్‌గూడ, చిన్న గోల్కొండ ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. బీ కేర్ ఫుల్.
SHARE IT
టెన్త్ విద్యార్థులు ఇవాల్టి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు చెల్లించవచ్చు. రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలి. దరఖాస్తులో HMతో సంతకం చేయించి, హాల్‌టికెట్ జతపరిచి DEO ఆఫీసులో ఇవ్వాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం అప్లై చేయకూడదు. అటు జూన్ 3 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఫైన్ లేకుండా మే 16 వరకు ఫీజు కట్టొచ్చు.
నిన్న మొన్నటి వరకు భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ పర్యటన, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని సంకేతాలు కనిపిస్తున్నాయి. BRS అభ్యర్థి మల్లేశ్, కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్, BJP బూర నర్సయ్య గౌడ్ మధ్య రసవత్తర పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల గారడీతో ప్రజలు మోసపోయి, KCR సంక్షేమ పాలన దూరం చేసుకున్నామని ఆవేదన చెందుతున్నారని BRS అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈరోజు వనపర్తి పట్టణంలోని ఎకో పార్కులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో BRS అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. తనను MPగా గెలిపిస్తే 6 నెలల్లోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు
10వ తరగతి ఫలితాల్లో తక్కువ (జీపీఏ) మార్కులు వచ్చాయని నవీపేట్ మండలం మహంతం గ్రామానికి చెందిన విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 8.3 జీపీఏ రావడంతో తక్కువగా వచ్చాయని మనస్తాపంతో పొలాల్లో కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్‌కు తరలించారు.
Sorry, no posts matched your criteria.