India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలం లక్కారాం గ్రామంలో గడప గడపకు మండల నాయకులతో కలిసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ లాండ్రి షాప్‌లో ఎమ్మెల్యే బట్టలను ఇస్త్రీ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.
లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన విజయ సోమవారం దారుణ హత్యకు గురైంది. అచ్చంపేట సీఐ రవీందర్ వివరాల ప్రకారం..విజయను తన భర్త చంద్రు గొంతు నులిమి చంపాడని, ఈ కేసులో అత్త లక్ష్మి, ఆడపడుచు బుజ్జి ప్రమేయం లేదన్నారు. చంద్రుని అరెస్టు చేసి అచ్చంపేట కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
తాటి చెట్టుపై నుంచి పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలోని బాదంకుర్తి గ్రామంలో జరిగింది. బాదంకుర్తి గ్రామానికి చెందిన కంటి శంకర్ బుధవారం ఉదయం తాటి ముంజలు తెంపడానికి తాటి చెట్టు ఎక్కాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాటి ముంజలు కోసే క్రమంలో తాటి చెట్టు పైనుండి పడి శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కంటి శంకర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. ఆయన మృతితో విషాదం నెలకొంది.
సదాశివనగర్ మండల కేంద్రంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి వైపు నుంచి నిర్మల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SSC-2024 ఫలితాలలో హనుమకొండలోని తేజస్వి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో తమ విజయ పరంపర కొనసాగించారు. 104 మంది 10 GPA సాధించారు. వీరితో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు మరెన్నో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్స్‌తో సత్తా చాటారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన బోధన, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది.
నల్లగొండ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. మాడ్గులపల్లి మండల కేంద్రంలో రికార్డుస్థాయిలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాంపల్లి మండల కేంద్రంలో 45.9 డిగ్రీలు, చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం జిల్లా అంతటా 41.1 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడం, ఉక్కపోత కారణంగా జనం తల్లడిల్లుతున్నారు.
ఖమ్మం నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే.. నియోజకవర్గంలోని 10/10 అసెంబ్లీ సీట్లని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రధాన పార్టీల మధ్యన హోరాహోరీ పోటీ నడుస్తోంది. దీంతో మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదో వేచి చూడాలి.
OYO వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. SRనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల వాసి హేమంత్(28) తన లవర్‌తో కలిసి సోమవారం HYD వచ్చాడు. ఓ ఫంక్షన్‌కు హాజరైన వీరు రాత్రి OYOలో బసచేశారు. మిడ్‌నైట్ తర్వాత బాత్రూంకి వెళ్లిన హేమంత్ ఎంతకీ రాకపోవడంతో అమ్మాయి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. 108కి కాల్ చేయగా సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించి, చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదైంది
OYOకి వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. SRనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల వాసి హేమంత్(28) తన లవర్‌తో కలిసి సోమవారం HYD వచ్చాడు. ఓ ఫంక్షన్‌కు హాజరైన వీరు రాత్రి OYOలో బసచేశారు. మిడ్‌నైట్ తర్వాత బాత్రూంకి వెళ్లిన హేమంత్ ఎంతకీ రాకపోవడంతో అమ్మాయి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. 108కి కాల్ చేయగా సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించి, చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదైంది.
OYOకి వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. SRనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల వాసి హేమంత్(28) తన లవర్‌తో కలిసి సోమవారం HYD వచ్చాడు. ఓ ఫంక్షన్‌కు హాజరైన వీరు రాత్రి OYOలో బసచేశారు. మిడ్‌నైట్ తర్వాత బాత్రూంకి వెళ్లిన హేమంత్ ఎంతకీ రాకపోవడంతో అమ్మాయి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. 108కి కాల్ చేయగా సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించి, చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.