Telangana

News May 1, 2024

MBNR: ఫుల్ ఫోకస్! గెలుపే లక్ష్యంగా ముందుకు

image

పార్లమెంటు ఎన్నికలలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి పాలమూరులో BJPకి సైతం ఆదరణ పెరుగుతోంది. దీంతో NGKL, MBNR పార్లమెంట్ స్థానాలలో గతంలో ద్విముఖ పోటీ జరిగితే.. ఇప్పుడు త్రిముఖ పోటీ అనివార్యం అవుతోంది.

News May 1, 2024

పదిలో హైదరాబాద్‌ DOWN.. కారణమిదే?

image

10th Resultsలో రాజధాని వెనుకబడిన సంగతి తెలిసిందే. గతేడాది <<13150824>>HYD 28, RR 14, MM 20వ<<>> స్థానాల్లో నిలవగా ఈ సారి‌ ఇంకా వెనుకబడ్డాయి. నగరంలోని గవర్నమెంట్‌ స్కూల్స్‌లో 7445 విద్యార్థుల్లో 5873 మంది పాస్ అయ్యారు. రంగారెడ్డి, మేడ్చల్‌లోని ప్రభుత్వ స్కూల్స్‌లో ఉత్తీర్ణత 80% మించలేదు. సర్కారుబడుల్లో మౌలిక వసతుల కొరత, జీవో 317పై ఆందోళనలు, విద్యార్థులు సక్రమంగా స్కూల్స్‌కి రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

News May 1, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌కు అగ్రనేతలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున మే 2న ఆసిఫాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మే 5న రాహుల్ గాంధీ నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. మే4 న KCR మంచిర్యాలలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనున్నారు. బీజేపీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌తో సభలను నిర్వహించాలని భావిస్తోంది.

News May 1, 2024

మిర్యాలగూడలో 96 శాతం ఉత్తీర్ణత!

image

మిర్యాలగూడ మండల పరిధిలోని 24 ప్రభుత్వ ZP ఉన్నత పాఠశాలల్లో 1,234 మంది విద్యార్థులు ssc పరీక్షలకు హాజరు కాగా 1,187 ఉత్తీర్ణులయ్యారని మండల విద్యాధికారి బాలాజీ నాయక్ తెలిపారు. 96 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అదేవిధంగా 15 మంది విద్యార్థిని, విద్యార్థులు 10/10 జిపిఎ సాధించి ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. బాలుర కంటే బాలికలదే పైచేయని తెలిపారు.

News May 1, 2024

సున్తీ చేస్తుండగా మర్మాంగం కట్

image

సున్తీ చేస్తూ మర్మాంగాన్ని కోసిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. నగరంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్డులోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అబ్దుల్ హమీద్ ఆర్‌ఎంపీ వైద్యుడు అదే ప్రాంతానికి చెందిన బాలుడికి సున్తీ చేస్తూ మర్మాంగాన్ని కోశాడు. వెంటనే ఆ బాలుడిని తల్లిదండ్రులు పక్కన ఉన్న ప్రవేటు హస్పిటల్‌కి తరలించగా.. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నిమ్స్‌కి తరలించారు.

News May 1, 2024

అల్లదుర్గ్: మోదీ రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం

image

భాజపా మెదక్, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థులు రఘునందన్ రావు, బీబీ పాటిల్‌లకు మద్దతుగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రసంగించారు. అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామ శివారులో నిర్వహించిన సభకు అత్యధిక జనాభా రావడంతో బీజేపీ శ్రేణుల్లో, యువతలో జోష్ నింపింది. ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సభ సక్సెస్ అయిందని బీజేపీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

News May 1, 2024

నేడు కోరుట్లకు సీఎం రేవంత్ రెడ్డి

image

కోరుట్ల పట్టణంలోని పశువైద్య కళాశాల సమీపంలో నేడు జరుగనున్న జన జాతర ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్సీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News May 1, 2024

వరంగల్ తూర్పులో BRS పార్టీకి ఎదురుదెబ్బ..!

image

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో BRSకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. గ్రేటర్ వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన-నవీన్ తమ సొంత గూటికి చేరుతున్నారని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఎట్టకేలకు వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బీజేపీలో పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలతో చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో BRS పార్టీకి షాక్ తగలనుంది.

News May 1, 2024

NZB: ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం..!

image

మే 13 సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని 10 పార్లమెంట్​ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ (అసెంబ్లీ బై ఎలక్షన్) స్థానానికి అధిష్ఠానం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. జహీరాబాద్ పార్లమెంట్‌కు రాజ్ మోహన్ ఉన్నితాన్, నిజామాబాద్ పార్లమెంట్‌కు ఎన్.ఎస్ బోసురాజు, మంతర్ గౌడ‌లకు బాధ్యతలు అప్పగించింది.

News May 1, 2024

యాచారం: క్రీడల్లో రాణిస్తూనే పది ఫలితాల్లో మొదటి స్థానం

image

పది ఫలితాల్లో చింతపట్ల జెడ్పిహెచ్ఎస్‌కు చెందిన బండి కంటి ఉమామహేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిపిఏ 8.7 సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఉమామహేశ్వరి 2 సార్లు రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడల్లో 5 సార్లు జిల్లా స్థాయిలో పాల్గొని పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించిందని హెచ్ఎం శోభాదేవి, పీఈటి సాబేర్ అన్నారు. భవిష్యత్తులో తగిన విధంగా ప్రోత్సహిస్తే చదువుల్లోనూ క్రీడల్లోనూ అద్భుతాలు సాధించవచ్చన్నారు