Telangana

News May 1, 2024

NZB: ఎన్నికల వేళ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం..!

image

మే 13 సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని 10 పార్లమెంట్​ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ (అసెంబ్లీ బై ఎలక్షన్) స్థానానికి అధిష్ఠానం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. జహీరాబాద్ పార్లమెంట్‌కు రాజ్ మోహన్ ఉన్నితాన్, నిజామాబాద్ పార్లమెంట్‌కు ఎన్.ఎస్ బోసురాజు, మంతర్ గౌడ‌లకు బాధ్యతలు అప్పగించింది.

News May 1, 2024

యాచారం: క్రీడల్లో రాణిస్తూనే పది ఫలితాల్లో మొదటి స్థానం

image

పది ఫలితాల్లో చింతపట్ల జెడ్పిహెచ్ఎస్‌కు చెందిన బండి కంటి ఉమామహేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిపిఏ 8.7 సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఉమామహేశ్వరి 2 సార్లు రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడల్లో 5 సార్లు జిల్లా స్థాయిలో పాల్గొని పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించిందని హెచ్ఎం శోభాదేవి, పీఈటి సాబేర్ అన్నారు. భవిష్యత్తులో తగిన విధంగా ప్రోత్సహిస్తే చదువుల్లోనూ క్రీడల్లోనూ అద్భుతాలు సాధించవచ్చన్నారు

News May 1, 2024

సిరిసిల్ల: సెలవులు ముగిసేలోగా పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సెలవులు ముగిసేలోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. వేములవాడ మండలం వట్టెంల, ఫాదర్ నగర్ గ్రామాలలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టనున్న మరమ్మతు పనుల మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు మరుగుదొడ్లు మరమ్మతుల పనులు చేయించాలని అధికారులకు ఆయన సూచించారు.

News May 1, 2024

HYD: రైల్వే పట్టాల పై ఆత్మహత్యలు!

image

HYD పరిధి సికింద్రాబాద్ రైల్వే పరిధిలో ఆత్మహత్యలు, పట్టాలు దాటుతుండగా జరిగిన మరణాల పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 2021లో-586, 2022-677, 2023-648 ఆత్మహత్యలు జరిగినట్లు తెలిపారు. గత మూడేళ్లలో పలు ప్రాంతాల్లో కలిపి 1815 రైల్వే పట్టాలు దాటుతూ మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆత్మహత్యలు, మరణాలు కలిపి 12కు పైగా నమోదయినట్లు వెల్లడించారు.

News May 1, 2024

నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్ బంద్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు బంద్ ఉండనుంది. కార్మికుల దినోత్సవం మే డే, అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కోన్నారు. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్ కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

News May 1, 2024

మే 2 నుంచి పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు: కలెక్టర్ హరిచందన

image

నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల విధులకు నియమించిన పీఓ, ఏపీఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుంచి 4 తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఇందుకుగాను పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు విధులను కేటాయించడం జరిగిందన్నారు.

News May 1, 2024

బీఆర్ఎస్‌ని బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం: భట్టి

image

గత ఎన్నికలో అప్రజాస్వామిక బీఆర్ఎస్ పార్టీని బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని డిప్యూటీ సీఎం మల్లు మట్టి విక్రమార్క అన్నారు. మధిరలో జరిగిన పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు మాసాల్లోనే తాము చెప్పిన గ్యారంటీలను అమలు చేసి చూపించామన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా పాలన చేశారని ఆరోపించారు.

News May 1, 2024

RR: ప్రాజెక్టుల పై ప్రజల కోటి ఆశలు!

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా 2.8 లక్షలు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డికి రూ.2,050 కోట్లు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.9000.59 కోట్లను మొదట ఖర్చు చేసి, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. దీంతో ఉమ్మడి RR జిల్లా ప్రజలు ప్రాజెక్టుల పై కోటి ఆశలు పెట్టుకున్నారు.

News May 1, 2024

RR: ప్రాజెక్టుల పై ప్రజల కోటి ఆశలు!

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా 2.8 లక్షలు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డికి రూ.2,050 కోట్లు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.9000.59 కోట్లను మొదట ఖర్చు చేసి, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. దీంతో ఉమ్మడి RR జిల్లా ప్రజలు ప్రాజెక్టుల పై కోటి ఆశలు పెట్టుకున్నారు.

News May 1, 2024

ఆసిఫాబాద్: CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన SP

image

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆసిఫాబాద్‌లోని ప్రేమల గార్డెన్‌లో ఏర్పాటు చేసి సభ స్థలాన్ని, హెలిప్యాడ్, వీఐపీ పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు, సభ స్థాయికి వచ్చి వెళ్లే దారులు, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ పరిశీలించారు. అనంతరం భద్రతాపరంగా తీసుకోవలసిన చర్యల గురించి, బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.