Telangana

News April 30, 2024

రేపు ఈ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం

image

రేపు కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్‌కు హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

News April 30, 2024

జిల్లాలను తగ్గిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం: KCR

image

గిరిజన బిడ్డలకు పాలన అందాలని కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేశాం, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను తగ్గిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మంగళవారం రాత్రి కొత్తగూడెంలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

News April 30, 2024

కొడంగల్: టెన్త్ ఫలితాలు.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

image

10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కొడంగల్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 67 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 97 శాతం ఉత్తీర్ణతతో 65 మంది పాసైనట్లు ప్రిన్సిపల్ బలరాం తెలిపారు. పాఠశాలకు చెందిన హరిచంద్ 10/10, సునీల్ 9.8/10 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది అభినందించారు.

News April 30, 2024

GREAT: ‘వెన్నచేడ్ MODEL SCHOOL’ లో 99% పాస్

image

మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని వెన్నచేడ్ మోడల్ స్కూల్లో M.పల్లవి విద్యార్థినికి 10/10(GPA)తో సత్తా చాటింది. దీంతో మంగళవారం జిల్లా కలెక్టర్ G.రవి నాయక్ ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య, ప్రిన్సిపల్ కొండల్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెన్నచేడ్ మోడల్ స్కూల్లో మొత్తం 93(B-58,G-35) మంది విద్యార్థులకు గాను..92(99%) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

News April 30, 2024

ములుగు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. తాడ్వాయి పసర జాతీయ రహదారి 163పై మంగళవారం రాత్రి అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటాపురం మండలానికి చెందిన జ్యోతి కిరణ్, వెంకటేశ్ మృతి చెందగా.. వాజేడు మండలానికి చెందిన రక్షిత్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాగా, వీరు ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News April 30, 2024

సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలలో 10జీపీఏ.. కలెక్టర్ సన్మానం

image

సూర్యాపేట జిల్లాలో పదో తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సత్తా చాటారని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. జిల్లాలో 354 మంది విద్యార్థులకు 10 /10 జీపీఏ వచ్చిందని తెలిపారు. మైనార్టీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10/10 తెచ్చుకున్న విద్యార్థిని కే.హారికను కలెక్టర్ ఉపాధ్యాయులతో కలిసి సన్మానించారు.

News April 30, 2024

జగదేవ్‌పూర్: చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేవి తప్పుడు పనులు: హరీశ్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవి శ్రీరంగనీతులని, చేసేవి అన్ని తప్పుడు పనులేనని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో హరీశ్ రావు ప్రసంగించారు. రుణమాఫీ చేయలేదని, హామీలు అమలు చేయలేదని, రాజీనామా చేస్తానంటే పారిపోయిండని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అయితే తిట్లు లేకుంటే దేవుని మీద ఓట్లు చేస్తున్నట్లు ఆరోపించారు.

News April 30, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి వినూత్న ప్రచారం 

image

“అమ్మా.. బావున్నారా?. వ్యాపారం ఎలా నడుస్తోంది.. గిట్టుబాటు అవుతోందా..” అంటూ కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి నాగులవంచ గ్రామంలో ఓ చిరు వ్యాపారి మహిళతో ముచ్చటించారు. ప్రచారంలో భాగంగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి మంగళవారం సాయంత్రం టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లారు. స్వయంగా ఆయనే కడాయిలో సమోసాలు వేసి కాల్చారు.

News April 30, 2024

NZB: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సాయి రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని ఆర్య నగర్‌కు చెందిన రాజవరపు శ్రీనివాస్(50) మంగళవారం సాయంత్రం ఇంటర్ సిటీ ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 30, 2024

సిద్దిపేట: ‘అంజన్నకు ఆస్తులు రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు’

image

సిద్దిపేట జిల్లా కోడూరు మండలంలోని అలిపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన ఆస్తులను కొండగట్టు ఆంజనేయస్వామికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కని పెంచిన కొడుకులు సరిగ్గా చూసుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా తన ఆస్తులను ఆంజనేయ స్వామి పేరిట పట్టా చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు.