India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసిఫాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో దహేగాం, కౌటాల, చింతలమానేపల్లి మండలంలోని లంబాడీహెట్టి, గుప్పగూడెం, కల్వాడ, రణవెల్లి, మర్రిగూడెం గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 60లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 4వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు.
HYD, RR, MDCL జిల్లాల్లో ప్రాథమిక వైద్యాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని గర్భిణీలు, చిన్నారులకు, పౌష్టికాహారం పంపిణీ చేసే అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డులు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు లబ్ధి పొందే వారి వివరాలపై కసరత్తు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిన్న, మొన్నటి వరకు BJP, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని జరిగిన ప్రచారానికి KCR పర్యటనతో త్రిముఖ పోటీకి బలం పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి BJP, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.
కడ్తాల్ పోలీస్ స్టేషన్.. మక్త మాదారం గ్రామ పరిధిలోని బటర్ ఫ్లై వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారని షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్.. మక్త మాదారం గ్రామ పరిధిలోని బటర్ ఫ్లై వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారని షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు.
మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రి మీద ఓ కొడుకు దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం ఎన్టీఆర్ నగర్‌లో చోటుచేసుకుంది. తన తండ్రి బుచ్చన్న తరుచూ మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఈ నెల 22న కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతడి కొడుకు మరో 8 మందితో కలిసి పథకం ప్రకారం ఇంటికి వచ్చి దాడి చేసినట్లు బాధితుడి అక్క రాజవ్వ సీపీకి ఫిర్యాదు చేసింది.
HYD నుంచి 200KM దూరంలో నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వెళ్లేవారిని చల్లటి ప్రదేశం మల్లెల తీర్ధం కనువిందు చేస్తుంది. శ్రీశైలం వెళ్లే దారిలో ఫరహాబాద్ నుంచి వలవర్లపల్లి మీదుగా 15కి.మీ దూరం ప్రయాణిస్తే దట్టమైన అడవి వస్తుంది. వాహనాలు అపి కొద్ది దూరం వెళ్తే లోయలోకి సుమారు 300 మెట్లు ఉంటాయి. లోయలోకి దిగితే చల్లటి వాతావరణం శరీరాన్ని ఆవహిస్తుంది. ఇంకేం మరీ వేసవి టూర్ వెళ్దామా..!
HYD నుంచి 200KM దూరంలో నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వెళ్లేవారిని చల్లటి ప్రదేశం మల్లెల తీర్ధం కనువిందు చేస్తుంది. శ్రీశైలం వెళ్లే దారిలో ఫరహాబాద్ నుంచి వలవర్లపల్లి మీదుగా 15కి.మీ దూరం ప్రయాణిస్తే దట్టమైన అడవి వస్తుంది. వాహనాలు అపి కొద్ది దూరం వెళ్తే లోయలోకి సుమారు 300 మెట్లు ఉంటాయి. లోయలోకి దిగితే చల్లటి వాతావరణం శరీరాన్ని ఆవహిస్తుంది. ఇంకేం మరీ వేసవి టూర్ వెళ్దామా..!
టెన్త్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఉ.9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్‌కు 15రోజుల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్సర్ షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలన్నారు.
అశ్వరావుపేటలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రింగ్ రోడ్ నుంచి వెంకట సినీ థియేటర్ వరకు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్లో అయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఇక్కడ పామాయిల్ బోర్డ్ తెప్పించే బాధ్యత తనదన్నారు.
Sorry, no posts matched your criteria.