India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పురుగు మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. ఉట్నూరు మండలం జైత్రాం తండాకి చెందిన నూర్ సింగ్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. నూర్ సింగ్ మంగళవారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలను కోరారు. మంగళవారం ఖమ్మంలో సీపీఎం నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గోని మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం కార్పొరేట్‌కు కట్టబెడుతోందని, బీజేపీని ఓడించి ప్రజాప్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.
మెదక్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా 44 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరం కానున్నాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు ఉండనుండగా, మూడు ఈవీఎంలు అవసరం కానున్నాయి. 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 6,372 ఈవీఎంలు అవసరం కానున్నాయి.
చేసిన పనికి బిల్లులు చెల్లించడం లేదని నిరసిస్తూ బీర్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి విజయ్ అనే కాంట్రాక్టర్ మంగళవారం తాళం వేశాడు. జీపీ దుకాణ సముదాయం నిర్మించి రెండేళ్లు గడిచినా రూ.20 లక్షలు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.10 లక్షల బిల్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న డీపీవో శ్రీనివాసరావు తమకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ ఖిల్లా అని, కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం కంచు కోటలాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో లేకపోయినా జిల్లాలో కాంగ్రెస్ పట్టు తగ్గకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కొనసాగించారన్నారు. దేశంలో దేశంలోని ప్రజలను మతం పేరుతో విడగొడుతోందని, బీజేపీ, బీఆర్ఎస్‌కు ఘోర పరాజయం తప్పదన్నారు.
నగర, పురపాలక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా ఏప్రిల్లో ఎర్లీ బర్డ్ స్కీంను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా రాయితీతో ఆస్తి పన్ను చెల్లించేందుకు ఎర్లీ బర్డ్ స్కీం ప్రవేశపెట్టారు. ఈ నెలలో పన్ను చెల్లించే వారికి ఈస్కీం ద్వారా 5శాతం రాయితీ లభిస్తుంది. రాయితీతో పన్ను చెల్లించే గడువు మంగళవారం ముగియనుంది. దీంతో వీలైనంత మేరకు పన్నులు వసూలు చేసేలా మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ను గెలిపించాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు మంగళవారం కేటీఆర్‌ను తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి కృషి చేయాలని కేటీఆర్ అన్నారు.
ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ నామా 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటివరకు అత్యధికం. ఆయన తన సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో నామాకు 5,67,459 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి.
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన బిందు సాయిలత అనే విద్యార్థి 10/10 జీపీఏ సాధించింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించినందుకు పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని అభినందించారు.
రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మెదక్ లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంత మంది ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఎన్నిక ఖర్చు కూడా అధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, మెదక్ ఎన్నికలకు అదనంగా మరో రూ.10 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి.
Sorry, no posts matched your criteria.