Telangana

News April 30, 2024

సిద్దిపేట: సమగ్ర వివరాలకు క్యూఆర్ స్కాన్

image

ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎన్నెన్నో మార్పులు సంతరించుకుంటాయి. ఇది వరకు ఓటరు స్లిప్ పై ఓటరు ఫోటోతో పాటు వివరాలు ఉండేవి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అందులో మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. ఓటరు స్లిప్ పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఓటరు పూర్తి వివరాలు కనిపిస్తాయి.

News April 30, 2024

గద్వాల: వచ్చే నాలుగు రోజులు వడగాలులు.. జాగ్రత్త

image

జోగులాంబ గద్వాల జిల్లాలో పలు మండలాల్లో 44.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వచ్చే నాలుగు రోజులు ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. పొడి వాతావరణంతో పాటు ఎండల తీవ్రత కొనసాగనుందని పేర్కొంది. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా వాసులు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

News April 30, 2024

10th Results: నారాయణపేటలో 93.13% పాస్

image

టెన్త్ ఫలితాల్లో నారాయణపేట సత్తాచాటింది. 93.13 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 15వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 7129 మంది పాసయ్యారు. MBNR(89.47%) 28వ స్థానంలో నిలవగా 11338 ఉత్తీర్ణత సాధించారు. NGKL(91.57) 23వ స్థానంలో ఉండగా 9621 పాసయ్యారు. WNP(86.93) 29వ స్థానంలో నిలవగా 5988 ఉత్తీర్ణత సాధించగా.. GDL(81.38) 32న స్థానంలో ఉండగా 5839 మంది పాసయ్యారు.

News April 30, 2024

సిద్దిపేట: నాడు తండ్రి.. నేడు తల్లిని చంపిన కొడుకు

image

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తిలో కొడుకు నరసింహులు దాడిలో గాయపడిన తల్లి భారతమ్మ(55) మృతి చెందింది. మద్యానికి బానిసైన నర్సింలు ఈనెల 27న తల్లితో గొడవపడి దాడి చేశాడు. చికిత్స పొందుతూ ఆమె నిన్న చనిపోయింది. కాగా 9ఏళ్ల క్రితం తండ్రి బాలమల్లుతో గొడవపడి దాడి చేయగా మృతి చెందాడు. కూతురు సరస్వతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 30, 2024

నిర్మల్: అందరి సహకారంతోనే ప్రథమ స్థానం: డీఈవో

image

అందరి సహకారంతోనే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్‌ను పూర్తి చేసి ప్రత్యేక స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని ఒకటి, రెండు మార్కులతో పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వారు ఆందోళన చెందకుండా సప్లమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు.

News April 30, 2024

కేసీఆర్ మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన: అర్వింద్

image

కేసీఆర్ మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన చేస్తున్నారని ఎంపీ అరవింద్ ధర్మపురి మండిపడ్డారు. అబద్ధపు హామీలతో రాష్ట్ర రైతులు, మహిళలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మంగళవారం డొంకేశ్వర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. వాటిని అమలు చేయడం చేతగాక దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని విమర్శించారు.

News April 30, 2024

10TH RESULTS: 14వ స్థానంలో నిజామాబాద్.. 19వ స్థానంలో కామారెడ్డి

image

పదో తరగతి ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా 93.72 శాతంతో 14 వ స్థానంలో నిలిచింది. 21,858 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 20,486 మంది పాసయ్యారు. 92.71 శాతంతో కామారెడ్డి జిల్లా 19వ స్థానంలో నిలిచింది. 11926 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 11057 మంది విద్యార్థులు పాసయ్యారు.

News April 30, 2024

10th Result: నల్గొండ 9, సూర్యాపేట 6, యాదాద్రి 25వ స్థానం

image

పదోతరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో నల్గొండ 96.11 శాతంతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట 96.91 శాతంతో 6వ స్థానం.. యాదాద్రి భువనగిరి 90.44 శాతంతో 25వ స్థానంలో ఉంది. నల్గొండలో మొత్తం 19,263మంది పరీక్ష రాయగా.. 18,513 మంది ఉత్తీర్ణులైయ్యారు. సూర్యాపేటలో మెత్తం 11,910 మంది పరీక్ష రాయగా 11,542మంది.. యాదాద్రి భవనగిరిలో మొత్తం 9,108 పరీక్ష రాయగా 8,237 పాసయ్యారు.

News April 30, 2024

10th Results.. సిద్దిపేట టాప్‌‌.. మెదక్ లాస్ట్

image

పదోతరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తాచాటింది. 98.64 ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రంలోనే సిద్దిపేట 2వ స్థానంలో నిలిచింది. ఇందులో బాలురు 6920, బాలికలు 6868 మంది ఉత్తీర్ణులయ్యారు. 97.86 శాతంతో సంగారెడ్డి జిల్లా 5వ స్థానంలో నిలవగా.. 10852 బాలురు, 10688 బాలికలు పాసయ్యారు. 92.96 శాతంలో మెదక్ జిల్లా18వ స్థానం సాధించగా.. అబ్బాయిలు 4608, అమ్మాయిలు 4945 మంది పాసయ్యారు.

News April 30, 2024

10th Result: నాలుగో స్థానంలో జనగామ

image

పదోతరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో జనగామ 98.16 శాతంతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. హనుమకొండ 95.99 శాతంతో పదో స్థానం, మహబూబాబాద్ 94.62 శాతంతో 12వ స్థానం, ములుగు 94.45 శాతంతో 13వ స్థానం, భూపాలపల్లి 92.96 శాతంతో 16వ స్థానం, వరంగల్ 92.20 శాతంతో 22వ స్థానంలో నిలిచింది.