Telangana

News July 19, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.56,449 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.29,282, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.17,100, అన్నదానం రూ.10,067 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News July 19, 2024

HYD: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరిక

image

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెహికల్ ఓనర్‌తో పాటు తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల HYD శివారులోని శంకర్‌పల్లిలో బాలుడు (16) స్నేహితులతో కలిసి కారును వేగంగా నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు గుర్తు చేశారు. దీంతో కారు యజమాని, తండ్రిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. SHARE IT

NZB: హోటళ్లలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తనిఖీలు

image

నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటళ్ల పరిసరాలతో పాటు కిచెన్లలో ఆహార పదార్థాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని, నిర్వహణ సరిగ్గాలేని హోటళ్లకు జరిమానాలు విధించారు. హైదరాబాద్ రోడ్డులోని ఓ హోటల్‌కు రూ.15వేలు, కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులోని ఓ హోటల్‌కు రూ.5వేల జరిమానా విధించారు.

News July 19, 2024

గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు

image

గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వెంకటాపురం మండలంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం మండలం ఆలుబాకకి చెందిన బానారి రాజు (45) ఈరోజు మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

News July 19, 2024

నిరూపిస్తే.. బండి సంజయ్ రాజీనామా చేస్తారా?: మంత్రి పొన్నం

image

బండి సంజయ్ వ్యవహారశైలి చూస్తుంటే గురివిందగింజ నలుపెరుగదనే సామెత గుర్తొస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 70% మంది రైతులకు రుణమాఫీ వర్తించట్లేదంటున్న బండి సంజయ్.. అది నిరూపించకపోతే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. తక్షణమే సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే భరించలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News July 19, 2024

NLG: సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం

image

సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. చండూరుకు చెందిన వీరమళ్ళ నాగరాజు ఎలక్ట్రికల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఫోన్‌కి ఉదయం ఓ లింక్ వచ్చింది. క్లిక్ చేయడంతో వెంటనే అకౌంట్ నుంచి రెండు దఫాలుగా లక్ష రూపాయలు డెబిట్ అయినట్టు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రుణమాఫీ నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News July 19, 2024

ఆదిలాబాద్‌‌లో CM ప్రారంభించేవి ఇవే..!

image

ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో పర్యటించనున్నారు. కాగా జిల్లాలో సీఎం ప్రారంభించే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్, ఎంఆర్ఐ మిషన్ ప్రారంభించనున్నారు. అలాగే కేజీబీవీ హైస్కూల్, బంగారి గూడ, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్నారు. వీటితో పాటు మదర్ పౌల్ట్రీ యూనిట్‌లను ఓకే చోట బటన్ నొక్కి ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.

News July 19, 2024

సికింద్రాబాద్‌ బోనాలకు రావాలని KCRకు ఆహ్వానం

image

HYD ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు‌ రావాలని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో KCRను సికింద్రాబాద్‌ MLA పద్మారావు‌ గౌడ్, ఆయన కుమారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని ఆహ్వానించారు. ప్రతి ఏటా లష్కర్‌ బోనాలకు‌ వచ్చే కేసీఆర్‌, టక్కర్‌బస్తీలోని పద్మారావు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.