Telangana

News April 30, 2024

PU పరిదిలో నెలరోజులు వేసవి సెలవులు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని పీజీ కళాశాలలకు విశ్వవిద్యాలయ అధికారులు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు మే 1 నుంచి జూన్ 4 వరకు ఉంటాయన్నారు. జూన్ 5న కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ఈ సెలవులు పాలమూరు విశ్వవిద్యాలయంతో పాటు పీజీ సెంటర్స్, పీజీ కళాశాలలకు వర్తిస్తుందని పేర్కొన్నారు.

News April 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,650 పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,200 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.150 పెరగగా.. అటు పత్తి ధర స్థిరంగా ఉన్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులను ఇబ్బందులను గురి చేయకుండా క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.

News April 30, 2024

వరంగల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. జల్లి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ వైస్ ఛైర్మన్ చెన్నారెడ్డి, ఆయన తల్లి విజయ మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అమీనాబాద్ శివారులో బైక్‌కు కుక్క అడ్డురావడంతో కింద పడ్డారు. ప్రమాదంలో విజయ అక్కడికక్కడే మృతి చెందగా, చెన్నారెడ్డికి గాయాలయ్యాయి.

News April 30, 2024

MBNR బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు మీరే..

image

కారుకొండ శ్రీనివాసులు, ముంగి నవీన్ రెడ్డి, అదరి అంజయ్య, మల్లెల హరీందర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటరమణ, కె.ఉదయ్ తేజ్ నాయక్, సభావటి విజయ, గంబావత్ దినేష్, హనుమేశ్ , ముడావత్ బాలరాజు నాయక్, నడిమింటి శ్రీనివాసులు, పి. సందీప్ కుమార్ రెడ్డి, బండ సత్యనారాయణ, గోవిందమ్మ, సంగపాగ సరోజనమ్మ, కె. యాదగిరి, టి. విష్ణువర్ధన్ రెడ్డి, ఉమాశంకర్, కె.వెంకటయ్య మొత్తం 21 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.

News April 30, 2024

మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో అభ్యర్థులు వీరే

image

డీకే అరుణ(BJP), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS), వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మహ్మద్ అల్లావుద్దీన్(BSP), ఆంజనేయులు(ఎంజై స్వరాజ్ పార్టీ), రాకేశ్ (ధర్మ సమాజ్ పార్టీ), వెంకటేశ్వర్లు(అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మస్ పార్టీ), శంకర్ రెడ్డి (విడుతలై చిరుతైగల్ కచ్చి), రవీందర్(సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా), నరేశ్ రెడ్డి(తెలంగాణ జాగీర్ పార్టీ), రహమాన్(బహు జన్ ముక్తి పార్టీ), స్వతంత్రులు 20 మంది ఉన్నారు.

News April 30, 2024

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య..

image

కంగ్టి మండలం చాప్టా(కే) శివారులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు కంగ్టి CI చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు ముర్కుంజాల్‌కు చెందిన వడ్డే సంజుగా గుర్తించారు. శరీరంపై ఉన్న గాయల ప్రకారం దారుణంగా హత్యకు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇంట్లో గొడవతో భార్య 2నెలల క్రితం పుట్టింటింటికి వెళ్లింది. సంజు తల్లిదండ్రులు చనిపోగా సోదరులు HYD వలస వెళ్లారు.

News April 30, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔పకడ్బందీగా ఎన్నికల నిర్వహణపై అధికారుల ఫోకస్
✔నేడు పలుచోట్ల ఓటరు స్లిప్పులు అందజేత
✔దామరగిద్ద:నేటి నుంచి గజలమ్మ జాతర ప్రారంభం
✔GDWL,NRPT:నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఎంపీ అభ్యర్థులు
✔ఎంపీ ఎన్నికలు.. రెండో విడత శిక్షణకు సమ్మహాలు
✔పకడ్బందీగా తనిఖీలు
✔ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసేలా అధికారుల ఫోకస్

News April 30, 2024

10th Result: ఖమ్మంలో 28,918 మంది వెయిటింగ్

image

నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. ఖమ్మం జిల్లాలో 16,577 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12341 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

News April 30, 2024

మెదక్: ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఈవీఎంలు..

image

మెదక్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా 44 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరం కానున్నాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు ఉండనుండగా, 44 మంది పోటీలో ఉండడంతో మూడు ఈవీఎంలో అవసరము కానున్నాయి. 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 6,372 ఈవీఎంలు అవసరం కానున్నాయి.

News April 30, 2024

కామారెడ్డి: అడవి పందిని ఢీకొని వ్యక్తి మృతి

image

అడవి పంది ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కుటుంబీకుల సమాచారం మేరకు మాచారెడ్డి మండలం సోమరంపేటకి చెందిన నునావత్ గంగారం మాచారెడ్డి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ ను అడవి పంది ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.