Telangana

News April 30, 2024

ఆదిలాబాద్: తేలిన ఓటర్ల లెక్క.. వారితోనే గెలుపు

image

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,50,175 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 36,338 మంది ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వారిదే ఆధిపత్యం. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News April 30, 2024

10th Result: నల్గొండలో 41,250 మంది వెయిటింగ్

image

నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. నల్గొండ జిల్లాలో 19,715 మంది, సూర్యాపేట జిల్లాలో 12,133, యాదాద్రి భువనగిరి 9,402 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

News April 30, 2024

2.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

జిల్లాలో 40,049 మంది రైతుల నుంచి 2,56,236 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులకు నేరుగా వారి ఖాతాలో రూ.321.62 కోట్ల డబ్బులు జమ చేసినట్లు వివరించారు. కేంద్రాల నిర్వాహకులు తూకం వేసిన వెంటనే కొనుగోలు వివరాలను ట్యాబ్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. మిల్లర్లు వారి కేటాయించిన సీఎంఆర్ ను గడువులోపు పూర్తి చేయాలన్నారు.

News April 30, 2024

10th Result: కరీంనగర్‌లో 38,230 మంది వెయిటింగ్

image

నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. కరీంనగర్ జిల్లాలో 12,650 మంది, పెద్దపల్లి జిల్లాలో 7,728, జగిత్యాలలో 11,366 మంది, సిరిసిల్లలో 6,486 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

News April 30, 2024

HYD: తండ్రి‌ తిట్టాడని‌ బాలిక సూసైడ్

image

మద్యం మత్తులో తండ్రి తిట్టడంతో 8వ తరగతి చదువుతున్న బాలిక(15) ఆత్మహత్య చేసుకొన్న ఘటన రాయదుర్గం PS పరిధి టెలికాంనగర్‌లో వెలుగుచూసింది. AP నంద్యాల జిల్లా లక్ష్మీపురానికి చెందిన దుద్దుకూరు సరోజ తన కుటుంబంతో కలిసి నగరానికి వచ్చింది. టెలికాంనగర్‌లోని గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. సోమవారం సరోజ రెండవ కూతురు రేవతిని తండ్రి తిట్టడంతో ఉరేసుకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 30, 2024

HYD: తండ్రి‌ తిట్టాడని‌ బాలిక సూసైడ్

image

మద్యం మత్తులో తండ్రి తిట్టడంతో 8వ తరగతి చదువుతున్న బాలిక(15) ఆత్మహత్య చేసుకొన్న ఘటన రాయదుర్గం PS పరిధి టెలికాంనగర్‌లో వెలుగుచూసింది. AP నంద్యాల జిల్లా లక్ష్మీపురానికి చెందిన దుద్దుకూరు సరోజ తన కుటుంబంతో కలిసి నగరానికి వచ్చింది. టెలికాంనగర్‌లోని గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. సోమవారం సరోజ రెండవ కూతురు రేవతిని తండ్రి తిట్టడంతో ఉరేసుకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 30, 2024

10th Result: వరంగల్‌లో 44,397 మంది వెయిటింగ్

image

నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. వరంగల్ జిల్లాలో 9,537 మంది, హనుమకొండలో 12,346 మంది, జనగామలో 6,698 మంది, భూపాలపల్లిలో 3,547 మంది, ములుగులో 3,088 మంది, మహబూబాబాద్‌లో 9,181 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

News April 30, 2024

సర్వేలన్నీ మనకే అనుకూలం: కేసీఆర్

image

కేసీఆర్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా నేతలతో సమీక్షించారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ సునామీ ఖాయమని.. 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని కేసీఆర్ తెలిపారు. ఖమ్మం సీటు గెలుస్తున్నామని, మిగతా పార్టీల అభ్యర్థుల కంటే నామ ముందంజలో ఉన్నట్లు సర్వే రిపోర్ట్‌లు చెబుతున్నాయని పేర్కొన్నారు. నేతలంతా కష్టపడి పని చేస్తే మంచి మెజార్టీ వస్తుందని దిశానిర్దేశం చేశారు.

News April 30, 2024

ఎంపీ ఎన్నికలు.. బర్రెలక్కకు ‘విజిల్’ గుర్తు కేటాయింపు  

image

నాగర్‌కర్నూల్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష)కు ఎన్నికల సంఘం ‘విజిల్’ కేటాయించింది. తన లైఫ్ టర్న్ అయిన, లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన సింబల్ ‘విజిల్’ వచ్చిందని శిరీష హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరపున నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎంతోమంది బెదిరించినా ఉపసంహరించుకోలేదన్నారు. నాగర్ కర్నూల్ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉంటాయని.. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు.  

News April 30, 2024

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థులు వీరే..

image

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS), మల్లు రవి (కాంగ్రెస్), భరత్ ప్రసాద్(BJP), బీసమోళ్ల యూసఫ్(BSP), అమరనాథ్(ఇండియా ప్రజాబంధు పార్టీ), అయ్యప్ప సునీల్(రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్), అంబోజు రవి(డెమోక్రటిక్ రిఫార్మ్), విజయ్(బహు జన్ ముక్తి పార్టీ), దాసరి భారతి(విదుతలై చిరుతైగల్ కచ్చి), ప్రాసంగి (పిరమిడ్ పార్టీ), విజయ్(విద్యార్థుల రాజకీయ పార్టీ), స్వతంత్రులు కర్నె శిరీష(బర్రెలక్క)తో పాటు 8 మంది బరిలో ఉన్నారు.