India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌తో శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు అరవింద్ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు విషయాలను చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగనున్న నేపథ్యంలో ఇరువురు భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సూర్యాపేట జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఉదయం నుంచి ఆ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. గతంలో సదరు అధికారి రెండు సార్లు ఏసీబీకి పట్టుబడినట్లు తెలుస్తోంది. రేపు సూర్యాపేట నుంచి బదిలీ కావాల్సి ఉండగా అంతలోనే ఏసీబీ అధికారులు పట్టుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు (AR) విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజు చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఖైదీలను రంగారెడ్డి జిల్లా కోర్ట్‌లో హాజరుపరుస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులు కనీస వసతులు కూడా లేక ఇలా రోడ్ పైనే భోజనం చేస్తున్నారు. అధికారులు మానవతా దృక్పథంతో పోలీసులకు డైనింగ్ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతున్నారు.
మహబూబ్నగర్ భూత్పూర్ మండలం ఎల్కిచర్ల శివారులో చిరుతపులి 3 పశువులను బలితీసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో పాదముద్రికలను పరిశీలించిన అధికారులు చిరుతపులిగా గుర్తించారు. చిరుత సంచారంతో భుట్టుపల్లి, ఎల్కిచర్ల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు.
ఔటర్ రింగురోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ గల మార్గంలో మొత్తం 18 అండర్పాస్ నిర్మించనున్నారు. ఈ హైవే విస్తరణలో భాగంగా చేవెళ్ల, మొయినాబాద్ వద్ద బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఈ 2 గ్రామాలు విస్తరించి ఉండడంతో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల పక్క నుంచి హైవే బైపాస్ నిర్మించాలని నిర్ణయించారు. దీనికి ఎక్కువగా భూసేకరణ చేయాల్సి వచ్చింది.
ఔటర్ రింగురోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ గల మార్గంలో మొత్తం 18 అండర్పాస్ నిర్మించనున్నారు. ఈ హైవే విస్తరణలో భాగంగా చేవెళ్ల, మొయినాబాద్ వద్ద బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఈ 2 గ్రామాలు విస్తరించి ఉండడంతో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల పక్క నుంచి హైవే బైపాస్ నిర్మించాలని నిర్ణయించారు. దీనికి ఎక్కువగా భూసేకరణ చేయాల్సి వచ్చింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం తేజ ఏసీ మిర్చి ధర స్వల్పంగా పెరగగా.. మిగతా ధరలు తగ్గాయి. తేజ మిర్చి నిన్న క్వింటాకు రూ.17 వేలు పలకగా.. నేడు రూ.17,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.16 వేలు పలకగా.. నేడు రూ.15,200 ధర వచ్చింది. వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ. 14 వేల ధర రాగా.. నేడు రూ.13,500 వచ్చింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తుల కుట్టు కూలీ నిధులను విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఈ దుస్తులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా సమాఖ్యలు కుట్టి పాఠశాలలకు అందించాయి. ఒక్కో జతకు రూ.50 చొప్పున నిధులు మంజూరు చేశారు.
నారాయణపూర్ జీపీలోని రాజుల గూడలో వైద్య సిబ్బంది. బురద రోడ్డులో రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గ్రామస్తులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 12 మంది రక్తం నమూనాలు సేకరించి, 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలకు రోగ నిరోధక టీకాలు వేశారు. హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కృష్ణ, ఏఎన్ఎం రేణుక, సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్టూరులో 43.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా గుండుమల్లో 21.8 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్లో 20.0 మి.మీ, వనపర్తి జిల్లా దగడలో 15.0 మి.మీ, గద్వాల జిల్లా భీమవరంలో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Sorry, no posts matched your criteria.