Telangana

News April 30, 2024

ఎంపీగా నామా గెలిస్తే కేంద్రమంత్రి అవుతాడు: కేసీఆర్‌

image

ఖమ్మం నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. పాలేరును ఎండబెట్టిన పాపం మంత్రులదేనన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతాడని పేర్కొన్నారు. నామా కేంద్రంలో మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా మేలు జరిగే అవకాశం ఉందని వివరించారు.

News April 30, 2024

NZB: రోడ్డు ప్రమాదం.. మహారాష్ట్ర వాసి దుర్మరణం

image

పోతంగల్ మండల శివారులోని మంజీరా నది రెండవ బ్రిడ్జి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతి చెందినట్టు సమాచారం అందుకున్న కోటగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు మహారాష్ట్ర లోని దెగ్లూర్ తాలూకా నరేంగల్ గ్రామానికి చెందిన హరి శంకర్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి వారు దర్యాప్తు చేస్తున్నారు.

News April 30, 2024

 ధరూర్ కస్తూర్బా సిబ్బందిపై వేటు

image

KGBVలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వులు జారీ చేశారు. సరుకుల పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదులు రావడంతో విచారణకు కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. దీనిపై అదనపు కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరూర్ కేజీబీవీ ప్రత్యేక అధికారి, అకౌంటెంట్, సీఆర్టీ ఉపాధ్యాయురాలు, అటెండర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఈనెల 25న డీఈవో ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎంఈఓ సురేశ్ తెలిపారు.

News April 30, 2024

ADB: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి!

image

MPఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఆదిలాబాద్ పరిధిలో 12 మంది అభ్యర్థులు మిగిలారు. నిన్న స్వతంత్ర అభ్యర్థి రాఠోడ్ రాజు తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. రిటర్నింగ్ అధికారి, సాధారణ పరిశీలకుల సమక్షంలో వీరికి గుర్తులు కేటాయించారు. పెద్దపల్లి లోక్ సభ స్థానానికి 42 మంది బరిలో నిలిచారు. నిన్న ఏడుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం కానున్నాయి.

News April 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో
∆} పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} మధిర నియోజకవర్గం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} కూసుమంచి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
∆} కల్లూరు మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రిలో ప్రత్యేక పూజలు

News April 30, 2024

మెదక్: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

image

మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల సమాచారం.. హైవేపై ద్విచక్ర వాహనం మీద దంపతులు ఇద్దరు వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామస్థులుగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 30, 2024

GDWL: చేనేత పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయి చేనేత పురస్కారాలకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి గోవిందయ్య తెలిపారు. అర్హులు, ఆసక్తి గల కళాకారులు తమ దరఖాస్తులను మే 20లోగా కార్యాలయ వెబ్‌సైట్ www.handlooms.nic.in నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు సంబంధించి మూడు ప్రతులను HYDలోని వీవర్స్ సర్వీస్ సెంటర్ బీ1, బీ2లో అందజేయాలన్నారు.

News April 30, 2024

బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

రంగారెడ్డి జిల్లా లోయపల్లికి చెందిన బూడిద బాలనర్సయ్య 2016లో నల్గొండ జిల్లాకు చెందిన మతిస్థిమితంలేని ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక మెడలో బలవంతంగా తాళికట్టి పెళ్లి అయినట్లు నమ్మించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా 9వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000జరిమానా విధించింది.

News April 30, 2024

NZB: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి!

image

MPఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. నిజామాబాద్ 29 నామినేషన్లు ఆమోదించగా.. 3 మంది విత్‌డ్రా చేసుకొన్నారు. ఎక్కువ మంది బరిలో ఉండటంతో రెండు ఈవీఎంలు తప్పనిసరైంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక్కడ కూడా ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు. SHARE IT

News April 30, 2024

జగిత్యాల: ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

image

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల పోలీస్ స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మనోహర్‌ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాన్ బెయిల్ వారెంట్ జారీ అయిన కేసులో పెరకపల్లి గ్రామానికి చెందిన తిరుపతి మామ గంగాధర్ వద్ద రూ.5,000 తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ తిరుపతి, సీఐ క్రిష్ణ కుమార్ పట్టుకున్నారు. దుబాయిలో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి మెయిల్ ద్వారా ACB DGకి ఫిర్యాదు చేశారు.