Telangana

News April 30, 2024

MDK బరిలో 44.. ZHB నుంచి 19 మంది అభ్యర్థులు

image

మెదక్ లోక్ సభ బరిలో 44 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్లు వేయగా స్ర్కూటీనిలో ఒకటి రిజెక్ట్ అయింది. సోమవారం వరకు 9 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గుర్తింపు పొందిన BRS, కాంగ్రెస్, BRS, బీఎస్పీ నుంచి నలుగురితోపాటు 11 మంది రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, 29 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. మెదక్‌లో ముక్కోణపు పోటీ జరగనుంది. అటు <<13147815>>జహీరాబాద్‌ బరిలో<<>> 19 మంది నిలిచారు.

News April 30, 2024

HYD: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి!

image

MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మల్కాజిగిరిలో 37 నామినేషన్లు ఆమోదించగా.. 15 మంది విత్‌డ్రా చేసుకొన్నారు. 22 మంది బరిలో నిలిచారు. HYD లోక్‌సభలో 8 మంది విత్‌ డ్రా చేసుకోగా.. 30 మంది బరిలో ఉన్నారు. చేవెళ్లలో 46 మందికి ముగ్గురు ఉససంహరించుకొన్నారు. 43 మంది పోటీలో నిలిచారు. ఇక సికింద్రాబాద్‌లో ఒక్కరే నామినేషన్ ఉపసంహరించుకొన్నారు. ఇక్కడ 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
SHARE IT

News April 30, 2024

మహబూబ్‌నగర్ ఎంపీ బరిలో 31 మంది అభ్యర్థులు

image

మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి 35 మంది నామినేషన్లు వేయగా స్క్రూటినీలో 35 మంది నామినేషన్లు ఆమోదించారు. వారిలో సోమవారం నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ ఉండనుంది.

News April 30, 2024

MBNR: ఖైదీలూ ఓటేయొచ్చు.. వారు ఇలా చేయాలి..!

image

సార్వత్రిక ఎన్నికల్లో ఖైదీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ప్రిమెంట్ డిటర్మినేషన్ కింద వివిధ నేరాల్లో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఓటు హక్కు కల్పించారు. తమకు ఫలానా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉందని, దానిని వినియోగించుకుంటామని జైలర్ కు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి జైలర్ ఆయా ప్రాంతాల నుంచి పోస్టల్ బ్యాలెట్ తెప్పిస్తారు.

News April 30, 2024

నేషనల్ హ్యాండ్లూమ్-2023 అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానం

image

జాతీయ సంత్ కబీర్& నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు-2023కి రాష్ట్ర ప్రభుత్వం, చేనేత జౌళి శాఖ దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా చేనేత మరియు జౌళిశాఖ అధికారి గోవిందయ్య తెలిపారు. చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ, డిజైన్ లో నైపుణ్యం కనబరిచిన వారు మరియు చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన చేనేత కళాకారులకు ప్రతిష్టాత్మక సంత్ కబీర్ &నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు ఇవ్వబడుతుందని.. మే 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 30, 2024

ప్రజలను ఇబ్బందులు పెడితే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

image

పౌరులు చట్టానికి లోబడి నడుచుకోవాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామాల్లో గొడవలు పెట్టుకోవద్దని, సోషల్ మీడియా నందు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దన్నారు.

News April 30, 2024

‘ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులందరూ సహకరించాలి’

image

నల్గొండ పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు లోకసభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి కోరారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో సమావేశమయ్యారు. 

News April 30, 2024

పక్కపక్కనే ఇద్దరు మంత్రులు.. నీళ్లెందుకు రాలేదు: KCR

image

ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి పక్కన నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి.. ఇద్దరు మంత్రులుండగ కాలువలో నీళ్లెందుకు రాలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం రోడ్ షో అయన మాట్లాడుతూ.. పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతామని రైతులు ఎందుకుపోయి దండయాత్ర చేశారు? అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినయ్‌. ఇవన్నీ చర్చించాలన్నారు. ఈ దేశం మీది.. రాష్ట్రం మీది..భవిష్యత్‌ మీది. యువత ఓ ఒరవడిలో కొట్టుకుపోవద్దన్నారు.

News April 30, 2024

జహీరాబాద్‌లో నియోజకవర్గంలో మహిళలే అధికం

image

జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం విడుదలైన తుది జాబితా ప్రకారం మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు 53వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. 2019 నుంచి 24 మధ్య 1,45,912 మంది పెరిగినట్లు అధికారుల వెల్లడించారు. పెరిగిన ఓటర్లలో మహిళల సంఖ్యే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

News April 30, 2024

WGL పార్లమెంట్ ఎన్నికల పోటీలో 42 మంది అభ్యర్థులు

image

15- వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి మొత్తం ఆమోదించిన నామినేషన్లు: 48, విత్ డ్రా చేసుకున్న అభ్యర్థులు: 06, మొత్తం బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 42 అని వరంగల్ రిటర్నింగ్ అధికారి ప్రావిణ్య తెలిపారు. ఎన్నికల స్క్రూట్నీ , నామినేషన్ ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో గుర్తుల కేటాయింపును ఈరోజు సాయంత్రం పరిశీలించనున్నారు.