Telangana

News September 6, 2024

గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

image

గోదావరిలో దూకి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం భద్రాచలంలో జరిగింది. స్థానిక పాత బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణ రెడ్డి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తివేత 

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32 వేల 276 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో: 1,55,845 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో : 72,845 క్యూసెక్కులుంది. పూర్తి స్థాయి నీటి మట్టం: 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 589.70 అడుగులుంది.  పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312 టీఎంసీలుండగా ప్రస్తుత 311.1486 టీఎంసీల నీరుంది. 

News September 6, 2024

బిక్కనూర్‌లో మహిళ దారుణ హత్య

image

మహిళ దారుణ హత్యకు గురైన ఘటన బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. భగీరథపల్లికి చెందిన యేసుమణిని ఆమె మరిది సురేశ్ కత్తులతో పొడిచి దారుణంగా హత్యచేసినట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News September 6, 2024

పాలమూరు: NH-44పై పెరుగుతున్న ప్రమాదాలు !

image

ఉమ్మడి పాలమూరు నుంచి వెళ్తున్న హైవే- 44 దేశంలోనే ప్రత్యేకమైనది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లో ప్రారంభమై.. తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని బాలనగర్ నుంచి అలంపూర్ చౌరస్తా వద్ద ముగుస్తుంది. కాగా జాతీయ రహదారిలో ప్రతి ఏడాది ప్రమాదాలు పెరుగుతున్నాయి. గతేడాది 85 ప్రమాదాలు జరిగ్గా.. 35 మంది చనిపోయారు. 463 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈడాది ఇప్పటికే 10 మందిపైగా చనిపోయారు.

News September 6, 2024

ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

image

భారీ వర్షాల కారణంగా ఎవరు ఊహించని రీతిలో వచ్చిన వరదల తాకిడికి ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జి పిల్లర్ల సైతం ముందుకు జరిగాయి. ఇప్పటికే వారం రోజు నుంచి బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను అధికారులు బంద్ చేశారు. అందులోని భాగంగానే నేటి నుంచి బ్రిడ్జి మరమ్మత్తులు చేపట్టడంతో, పూర్తిగా 6 నెలల పాటు వాహనాల రాకపోకలను అధికారులు బంద్ చేయనున్నట్లు సమాచారం.

News September 6, 2024

మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి బాల్యం విశేషాలు

image

జిట్టా బాలకృష్ణారెడ్డి 14 డిసెంబర్ 1972న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 1993లో ఎల్‌బీ నగర్‌లోని డీవీఎం డిగ్రీ & పీజీ కళాశాల గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు.

News September 6, 2024

HYD: ప్రభుత్వాన్ని వదిలిపెట్టం: హరీశ్‌రావు

image

రుణమాఫీ కాలేదని రైతన్నలు ధైర్యాన్ని కోల్పోవద్దని, రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మేడ్చల్లో రుణమాఫీ కాలేదని రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం బాధ కలిగించిందన్నారు. పంట పండించే రైతన్న ప్రాణాలు కోల్పోయి గాంధీ ఆసుపత్రి వద్ద ఉంటే మనసు చలించి పోయిందన్నారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.

News September 6, 2024

మట్టి విగ్రహాల వాడకంతో కుల వృత్తులకు మేలు: మంత్రి పొన్నం

image

హైదరాబాద్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మట్టి విగ్రహం మహా విగ్రహం మట్టి వినాయక పంపిణీ’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందరి జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మట్టి విగ్రహాలు వాడడం వల్ల కుల వృత్తులు బాగుపడతాయని అన్నారు.

News September 6, 2024

జిట్టా బాలకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..

image

జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2009లో భువనగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత జగన్ నాయకత్వంలో వైసీపీలో చేరారు. కొంతకాలానికి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇటీవలే దాన్ని బీజేపీలో విలీనం చేశారు. కొన్ని రోజులకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

News September 6, 2024

HYD: వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి

image

గణేష్ ఉత్సవాల్లో భాగంగా మండపాలు ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మండపం ఏర్పాటు, విగ్రహం ఎత్తు, ప్రాంతం, ఊరేగింపు, నిమజ్జనం తదితర వివరాలన్నీ నమోదు చేయాలని సూచించారు.