India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశానికి సంబంధించి కోడ్ ఉల్లంఘనతో పాటు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఎన్నికల పరిశీలకులను సంప్రదించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా మొబైల్ నంబర్ 9177435833, పోలీస్ పరిశీలకులు మనీష్ చౌదరి మొబైల్ నంబర్ 7032800525, వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే మొబైల్ నంబర్ 9032659531లో సంప్రదించాలన్నారు.
గద్వాల అర్బన్ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం లకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఎన్సీడీ పోర్టల్ లో లింక్ చేసే విధానంపై డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్ రాజు మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజు అబా కార్స్ లింక్ చేసిన తర్వాత వారి సంఖ్యను జిల్లా ఆరోగ్య కేంద్రానికి తెలపాలన్నారు. ప్రాక్టికల్ గా ట్యాబ్ లో అబా కార్స్ లింక్ చేశారు.
ఒక ఆడబిడ్డను ఓడించాలని కాంగ్రెస్ వాళ్ళు మాటల దాడి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. సోమవారం హన్వాడ మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ పాల్గొన్నారు. జూటా మాటలు చెప్పి, 6గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి హామీల అమలులో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని ఆమె అన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర అధ్యక్షుడుగా వరంగల్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు PDSU జాతీయ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో ఈరోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను నియమించారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దుచేస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీలను పటిష్ట పరచాలని నూతన అధ్యక్షుడు డిమాండ్ చేశారు. విద్యా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఖమ్మంలో నిర్వహించినoచిన రోడ్ షోలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్నారు. బీఆర్ఎస్‌కు 12 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా నాగేశ్వర్ రావు కేంద్ర మంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు, సీట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. సిద్దిపేట 44.3, సదాశివపేట 43.6, కొండాపూర్ 43.5, నిజాంపేట 43.4, తుక్కాపూర్ 43.2, దూల్మిట్ట, వట్ పల్లి లలో 43.1, చేగుంట, కౌడిపల్లి, శనిగరం లలో 42.9, బెజ్జంకి 42.8, బీహెచ్ఈఎల్ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
అశోక్ గులాటీ ఆగ్రో ఎకానమిస్ట్‌తో అనేక మాసాలపాటు చర్చించి ఓ నిర్ణయం తీసుకొని రైతులను నిలబెట్టాలని నాలుగైదు కార్యక్రమాలు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సోమవారం రోడ్‌షోలో భాగంగా ఖమ్మం కార్నర్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతుబంధు ఇచ్చామని, కరెంటు, నీటి తీరువా లేకుండా చేశామని, పాత బకాయిలు రద్దు చేశామని, ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని పేర్కోన్నారు.
OUలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదంటూ జరుగుతున్న ప్రచారంపై <<13137079>>DigitalMediaTS<<>> వివరణ ఇచ్చింది. ‘జలమండలి MD సుదర్శన్ రెడ్డి VC రవీందర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. HMWSSB ఉన్నతాధికారులు సంబంధిత AEతో కలిసి OUను సందర్శించారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అవసరమైతే OU అధికారుల అభ్యర్థన మేరకు మరింత నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధంగా ఉంది’అని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో బలం ఇవ్వాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్‌షోలో భాగంగా ఖమ్మం కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందన్నారు. రైతుబంధును బుర్రలేక పెట్టినమా ? ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సబ్సిడీ, మద్దతు లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదన్నారు.
OUలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదంటూ జరుగుతున్న ప్రచారంపై <<13137079>>DigitalMediaTS<<>> వివరణ ఇచ్చింది. ‘జలమండలి MD సుదర్శన్ రెడ్డి VC రవీందర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. HMWSSB ఉన్నతాధికారులు సంబంధిత AEతో కలిసి OUను సందర్శించారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అవసరమైతే OU అధికారుల అభ్యర్థన మేరకు మరింత నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధంగా ఉంది’అని స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.