India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ ఏసీబీకి చిక్కాడు. రూ. 25వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మత్స్యశాఖ సోసైటి సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఏసీబీ అధికారలకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్‌ల బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. బదిలీ అయినప్పటి నుంచి సెలవులో ఉన్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్‌ల బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. బదిలీ అయినప్పటి నుంచి సెలవులో ఉన్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
పెద్దపల్లి ప్రజలకు ఆర్టీసీ డిపో ఏర్పాటు 30 ఏళ్లుగా కలగానే మిగిలింది. జిల్లాగా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా సాధ్యం కాలేదు. డిపో ఏర్పాటుకు పెద్దపల్లిలో అందుబాటులో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంపై పాలకులు దృష్టి సారించడం లేదు. కాగా ప్రభుత్వం రెండు రోజుల క్రితం మోత్కూరు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి పెద్దపల్లికి ఎప్పుడు వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.7,245 పలికింది. గత వారం రూ.7,400 పలికిన పత్తి ధర.. ఈ వారం క్రమంగా తగ్గడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వారంలో పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7,310, మంగళవారం రూ.7,350, బుధవారం మార్కెట్ బంద్, గురువారం రూ.7,235కి పలికాయి.
ఖిల్లాఘనపురం మండలంలోని మామిడిమాడ సబ్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్‌మన్ పరమేశ్వర్ తృటిలో చిరుతదాడి నుంచి తప్పించుకున్నాడు. గురువారం విధుల్లో భాగంగా జంమాయపల్లి నుంచి మామిడిమాడ తండాకు వస్తుండగా మార్గమధ్యలో చిరుత ఆయన దగ్గరకు వస్తూ కనిపించింది. ఒక్కసారిగా తన బైక్ వేగం పెంచి పులి నుంచి తప్పించుకొని తండాకు వచ్చాడు. ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకుని తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం-వాజేడు మండలాల సరిహద్దు అభయారణ్యంలోని మహితాపురం, బొల్లారం గ్రామాల సమీపంలో ఉన్న గడి చెరువు జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఎత్తయిన గుట్టలపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. గుట్టలపై నుంచి జాలువారుతున్న జలధారలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. మరి మీరు ఈ జలపాతం చూశారో కామెంట్ చేయండి.
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు గురువారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ప్రదీప్ పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 16 మంది నాయకులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వేటుకు గురైన వారిలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. వారితో పాటు పార్టీ క్రమశిక్షణ చర్యల కింద పలువురు నాయకులకు సైతం బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ఆలయం పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ విజయరామారావు ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చివరి రోజు గురుపౌర్ణమి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.