India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల వేళ రాజధానిలో పోలీసులు RAIDS చేస్తున్నారు. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధి సుమారు 8 ప్రాంతాల్లో సోదాలు చేశారు. వాహనాల్లో తరలిస్తున్న రూ. కోటి 97 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్, రాజేంద్రనగర్, చందానగర్, నార్సింగితో పాటు పలు ప్రాంతాల్లో సరైన పత్రాలు లేని నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలోనే కరెంట్ కష్టాలు మొదలయ్యయని .. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని భట్టి ఫైర్ అయ్యారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆయన మండిపడ్డారు.
బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన బిజెపి బీసీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. సమావేశంలో బీసీ మోర్చ నాయకులు పాల్గొన్నారు.
పాలకుర్తి MLA యశస్విని రెడ్డితో సోమవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి.. తీన్మార్ మల్లన్నకు పెన్నును గిఫ్టుగా ఇచ్చారు. ఆమెతో పాటు ఝాన్సీ రెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి 34 మంది నామినేషన్ వేయగా స్క్రూటినీలో 21 మంది నామినేషన్లు ఆమోదించారు. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో NGKL ఎంపీ బరిలో 19 మంది నిలిచినట్లు రిటర్నింగ్ అధికారి ఉదయ కుమార్ తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.
సిరిసిల్ల జిల్లాలో ‘ఆపరేషన్ చబుత్ర’ మొదలైంది. రాత్రి పూట సరదాగా బయట తిరిగితే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సరైన కారణం లేకుండా రాత్రిపూట రోడ్లపై తిరిగితే అంతే సంగతి. SP అఖిల్ మహాజన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ చబుత్రలో భాగంగా ఇప్పటివరకు ఏ కారణం లేకుండా తిరుగుతున్న 256 మంది యువకులను వారి 81 ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.
అల్లాదుర్గంలో రేపు మధ్యాహ్నం నిర్వహించ తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ స్థలిని సోమవారం మధ్యాహ్నం బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ మేరకు సంబంధిత సభా వేదిక ఏర్పాట్ల నిర్వాహకులతో చర్చించారు. ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని బీబీ పాటిల్ సూచించారు.
వరంగల్ జిల్లాలో TOSS INSTER & SSC పబ్లిక్ పరీక్షలలో భాగంగా నాలుగవ రోజైన సోమవారం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించా మని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి అన్నారు. ఈ రోజు (5) పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. ఓపెన్ టెన్త్ ఎస్ఎస్సి లో ఉదయం 86% , మధ్యాహ్నం 84% మంది విద్యార్థులు హాజరైనారన్నారు. ఇంటర్లో ఉదయం 91% మధ్యాహ్నం 88% మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబందించి ఏమైనా సందేహాలు, ఫిర్యాదుల కోరకు సంప్రదించవచ్చని పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద తెలిపారు. ఫిర్యాదు చేయదలుచుకున్న వారు ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు 8143876383 నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. నేరుగా ఫిర్యాదు చేయదలచిన వారు ఆదిలాబాద్‌లోని పెన్ గంగా గెస్ట్ హౌస్‌లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీ సందర్భంగా 10 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మిగతా 32 మంది అభ్యర్థుల్లో ముగ్గురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు ఉన్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.