Telangana

News April 29, 2024

WGL: ‘6గురు నామినేషన్ ఉపసంహరణ’

image

వరంగల్ 15 పార్లమెంటు నియోజకవర్గం స్థానానికి నామినేషన్ వేసిన అభ్యర్థులు సోమవారం మధ్యాహ్నం 03.00 గంటల వరకు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పి. ప్రావీణ్య ప్రకటించారు. ఇందులో 1. ఇల్లందుల శోభన్ బాబు, 2. కుమ్మరి కన్నయ్య, 3. బాబు బర్ల, 4. మార్గ రాజభద్రయ్య, 5. డాక్టర్ విజయ్ కుమార్, 6. వేణు ఇసంపెల్లి అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారని అన్నారు.

News April 29, 2024

REWIND: మహబూబ్‌నగర్ హ్యాట్రిక్ ఎంపీలు వీరే..

image

MBNR పార్లమెంట్‌కు ఇప్పటి వరకు జరిగిన 17 ఎన్నికల్లో 8సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 1957లో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు ఎంపీగా గెలిచారు. తిరిగి 1967, 71, 77లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1980లో మల్లికార్జున్‌ గెలుపొందగా, తిరిగి 1989, 91, 96లో వరుసగా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఈ ఇద్దరు ఎంపీలుగా 4 సార్లు ఎన్నిక కాగా వరుసగా 3సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.

News April 29, 2024

ఖమ్మం జిల్లాలో బరిలో ఉండేది ఎవరు!

image

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో నేడు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు సమయం ముగియడంతో.. ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారు అనే విషయం వెల్లడి కానుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఖమ్మం జిల్లా పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.

News April 29, 2024

జీవన్‌రెడ్డి గెలిస్తే జగిత్యాల లవ్ జిహాద్ అవ్వడం పక్కా: అర్వింద్

image

నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిస్తే జగిత్యాల లవ్ జిహాద్‌కు అడ్డగా మారుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇది వరకే జగిత్యాల పీఎఫ్ఐ‌కి అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెబుతూ పబ్బం గడుపుతున్నరని అన్నారు.

News April 29, 2024

KMM: సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త!

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక PSలో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.

News April 29, 2024

KMM: ఎంపీ అభ్యర్థుల ప్రచారం.. ఓ ‘అగ్గి’ పరీక్షే

image

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు సతమతమవుతున్నాయి . వారికి ఎండ ఓ సవాలుగా మారింది. రెండు వారాలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. ఎండ తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

News April 29, 2024

హైదరాబాద్‌: ఓయూలో నెల రోజులు బంద్

image

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లు, మెస్‌లకు వచ్చే నెల 1వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ప్రకటన జారీ చేశారు. వేసవి నేపథ్యంలో <<13137079>>మంచినీరు, విద్యుత్ కొరత <<>>ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యార్థులందరూ సహకరించాలని కోరారు. SHARE IT

News April 29, 2024

ఖమ్మం: కాంగ్రెస్ నేత నామినేషన్ ఉపసంహరణ

image

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆ పార్టీ నేత పోట్ల నాగేశ్వరరావు  ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామ్ రెడ్డి పోటీలో ఉండడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

News April 29, 2024

NLGa: మద్యం.. మనీ ప్రభావంపై నిఘా

image

పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రలోభాలకు తావులేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. బెల్టు షాపులన్నింటినీ మూసివేయడంతోపాటు నిరంతర నిఘా ఏర్పాటుచేసి మద్యం ప్రవాహం ఓటర్లపై ఉండకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటి వరకు 140 కేసులను నమోదు చేయడంతోపాటు రూ.26.25 లక్షల విలువ కలిగిన 44వేల లీటర్ల మద్యం సీజ్ చేశారు.

News April 29, 2024

ఉమ్మడి జిల్లాలో భానుడి భగభగలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. నేడు జన్నారంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.