Telangana

News April 29, 2024

KMM: మహిళ మెడలో గొలుసు చోరీ

image

చేతిలో లగేజీతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన స్థానిక కవిరాజనగర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక 13వ వీధిలో ఓమహిళ రెండు చేతుల్లో బ్యాగులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని గొలుసు లాక్కుని పారిపోయాడు. ఘటనలో 3 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

News April 29, 2024

KMR: MLA టికెట్ త్యాగం చేసి ఎంపీ బరిలోకి

image

కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన ఆయనకు ఆ పార్టీ అధినాయకత్వం MP టికెట్‌ను కట్టబెట్టింది. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు.

News April 29, 2024

బల్మూరు: పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తాం అంటూ పోస్టర్లు

image

బల్మూర్ మండలంలోని మైలారం గ్రామ సమీపంలో ఉన్న గుట్టపై కొనసాగుతున్న మైనింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ గత కొంతకాలంగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు మేం దూరం.. దూరం అంటూ గ్రామంలో పోస్టర్లు వెలిశాయి. గుట్ట ముద్దు.. ఓటు వద్దు అనే నినాదంతో పోస్టర్లు వేశారు.

News April 29, 2024

రేపు మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం శివారులోని చిల్వేర్ వద్ద నిర్వహించే సభలో ఆయన పాల్గొనున్నారు. మెదక్ స్థానం నుంచి ఈ ఎన్నికలో
బీజేపీ తరఫున రఘునందన్, జహీరాబాద్ నుంచి బీబీపాటిల్ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది.

News April 29, 2024

ఆదిలాబాద్: ఏజెన్సీ వాసులకు ఏటా తప్పని కష్టాలు

image

వర్షం వస్తే జిల్లాలో నేటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే వందలాది గ్రామాలున్నాయి. అక్కడ పురిటి నొప్పులతో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక మృత్యువాత పడుతున్న తల్లుల వేదన పట్టించుకునే వారు కరవయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నెలల తరబడి వాగులు దాటాల్సిన దయనీయ పరిస్థితులు. రేషన్ తెచ్చుకోవాలన్నా, ఇతర పనులకు వెళ్లాలన్నా నరకమే. ఏటా ఎన్నో గ్రామాలు వేదన పడుతున్నా పాలకులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

News April 29, 2024

ఆదిలాబాద్: ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.95 లక్షలే..

image

ADB, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. ఇందులో కొందరు ర్యాలీలు నిర్వహించి నామినేషన్లను దాఖలు చేయగా.. ఎన్నికల ఖర్చుల లెక్క చూపాల్సి ఉంటుందని మరికొందరు సాదాసీదాగా వేశారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయరాదనే నిబంధన పెట్టింది. పరిమితి దాటితే ఎన్నికైనా సరే పదవికి ఎసరు తప్పదు. గతంలో రూ.70 లక్షలు ఉండేదాన్ని రూ.95 లక్షలకు ఎన్నికల సంఘం పెంచింది.

News April 29, 2024

HYD: ఫోన్ మాట్లాడుతూ ఇంటిపై నుంచి కింద పడి బాలుడి మృతి

image

తల్లితో ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బాలుడు ఇంటిపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన అల్వాల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. హస్మత్‌‌పేటకు చెందిన రవీంద్ర (16) ఇంటి పైకెక్కి తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 29, 2024

HYD: ఫోన్ మాట్లాడుతూ ఇంటిపై నుంచి కింద పడి బాలుడి మృతి

image

తల్లితో ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బాలుడు ఇంటి పై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన అల్వాల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. హస్మత్‌‌పేటకు చెందిన రవీంద్ర (16) భవనం పైకెక్కి తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 29, 2024

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ హీట్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఎక్కుతుంది. ఒకే రోజు ఇద్దరు వివిధ పార్టీలకు చెందిన ఆగ్రనేతలు పర్యటనలతో జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మంలో రోడ్ షోకు KCR, కొత్తగూడెంలో BJP సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అటు కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి రఘురాం రెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు. దీంతో జిల్లాలో పొలిటికల్ హీట్ తారస్థాయి చేరింది.

News April 29, 2024

జహీరాబాద్ ఎంపీ ఎలక్షన్.. రేపు ప్రధాని మోదీ రాక

image

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లాదుర్గం శివారులోని చిల్వేర్ వద్ద నిర్వహించే సభలో ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులను తరలించనున్నారు. జహీరాబాద్ స్థానానికి 4వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిసారి కాంగ్రెస్, తర్వాత వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది.