Telangana

News April 29, 2024

జహీరాబాద్: ఓటర్లు పెరిగారు.. మరి ఓటింగ్ శాతం పెరిగేనా?

image

జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. 2019 నుంచి 2024 వరకు ఈ స్థానంలో 1,45,912 మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానానికి 2009లో 74.67 శాతం, 2014లో 77.28 శాతం, 2019లో 69.70 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం పెరిగిన ఓటర్ల సంఖ్యతో ఈసారి పోలింగ్ శాతం పెరగనుందని పలువురు భావిస్తున్నారు.

News April 29, 2024

ఆదిలాబాద్: బరిలో ఉండేదెవరో?

image

ADB, పెద్దపల్లి ఎంపీ స్థానాలకు ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది నేడు తేలనుంది. ADB ఎంపీ స్థానానికి 23 మంది నామినేషన్లు వేశారు. 10 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 13 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి 63 మంది నానినేషన్లు వేశారు. 14 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామపత్రాల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఎందరు పోటీలో ఉన్నారో అధికారులు ప్రకటిస్తారు.

News April 29, 2024

గాంధారిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభ్యం

image

కామారెడ్డి జిల్లా గాంధారిలో గల వంతెన సమీపంలో పాడుబడ్డ బాయిలో గుర్తుతెలియని మహిళ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు గాంధారి పోలీసులు తెలిపారు. మహిళ శవం కుళ్ళిన స్థితిలో ఉండి గులాబీ రంగు చీర ఉందని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాంపై వారు విచారణ చేపట్టారు.

News April 29, 2024

NLG: అక్కడ అత్యధికం.. ఇక్కడ అత్యల్పం!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. 40 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా మాడ్గులపల్లి మండల కేంద్రంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యల్పంగా చింతపల్లి మండలం గోడకొండలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. 

News April 29, 2024

బీఆర్‌ఎస్‌కు సవాల్‌గా ఖమ్మం

image

ఖమ్మం లోక్‌సభ ఎన్నిక బీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఓట్లను కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెలకొంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది.

News April 29, 2024

KNR: 44 రోజుల్లో రూ.9.71 కోట్ల నగదు స్వాధీనం

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఉమ్మడి జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీలలో రూ.9.71 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 71లక్షలకు మాత్రమే ఆధారాలు చూపించి వెనక్కి తీసుకున్నారు. బంగారం, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.

News April 29, 2024

గ్రేటర్ HYDలో 8,81,201 ఓట్ల తొలగింపు!

image

ఓటరు జాబితాలో ప్రక్షాళనలో భాగంగా భారత ఎన్నికల సంఘం రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లో 8,81,201 ఓట్లను తొలగించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,41,201 మంది ఓట్లను తొలగించారు. ఇందులో 4,39,801 మంది నివాసం మారగా.. 54,259 మంది డూప్లికేట్, 47,141 మంది ఓటర్లు మరణించారు. రంగారెడ్డి జిల్లాలో 2.6 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 80 వేల ఓట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

News April 29, 2024

గ్రేటర్ HYDలో 8,81,201 ఓట్ల తొలగింపు!

image

ఓటరు జాబితాలో ప్రక్షాళనలో భాగంగా భారత ఎన్నికల సంఘం రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లో 8,81,201 ఓట్లను తొలగించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,41,201 మంది ఓట్లను తొలగించారు. ఇందులో 4,39,801 మంది నివాసం మారగా.. 54,259 మంది డూప్లికేట్, 47,141 మంది ఓటర్లు మరణించారు. రంగారెడ్డి జిల్లాలో 2.6 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 80 వేల ఓట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

News April 29, 2024

నిజామాబాద్: బరిలో ఉండేదెవరో?

image

నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ స్థానాలకు ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది నేడు తేలనుంది. NZB ఎంపీ స్థానానికి 42 మంది నామినేషన్లు వేశారు. 10 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 32 మంది బరిలో ఉన్నారు. ZHB ఎంపీ స్థానానికి 40 మంది నానినేషన్లు వేశారు. 18 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామపత్రాల ఉపంహరణకు మధ్యాహ్నం 3 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఎందరు పోటీలో ఉన్నారో అధికారులు ప్రకటిస్తారు.

News April 29, 2024

శ్రీరాంపూర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

ఇంటర్ ఫెయిల్ కావడంతో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీరాంపూర్‌లో చోటుచేసుకుంది. మంచిర్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ప్రథమ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4 సబ్జెక్టుల్లో అనుత్తీర్ణుడు కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో క్షణికావేశానికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ తెలిపారు.