India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డోర్నకల్- గద్వాల రైలు మార్గాన్ని సర్వే సంస్థ గగనతల పద్ధతుల్లో గుర్తించింది. సూర్యాపేట- ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎస్‌సీపీ-104 నుంచి ప్రారంభించి డోర్నకల్ సమీపంలోని దుబ్బబంజర ప్రాంతంలో 118 వరకు మార్కింగ్ చేపట్టింది. కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణం మండలాల్లో సుమారు 1,300 నుంచి 1,400 ఎకరాల భూములు సేకరించనున్నట్లు సమాచారం.
నల్గొండ, భువనగిరి స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన సభ చౌటుప్పల్‌లో ఖరారైంది. మే నెల 3న లేదంటే 7, 8 తేదీల్లో ఒక రోజు సభ ఉండే అవకాశం ఉందని రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ పాగా వేయాలని భావిస్తోంది. ఆ మేరకు మే నెల మొదటి వారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది.
కొత్తకోట మండలంలోని ముమ్మళ్ళపల్లి గ్రామంలో ఆదివారం గుర్తుతెలియని మృతదేహం లభించింది. ఎస్సై మంజునాథ్ రెడ్డి వివరాల ప్రకారం.. 44వ జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని మృతదేహం పడి ఉందని సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు బానోత్ అనిల్ (26) శనివారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు అనిల్ ఆచూకీ కోసం వెతికే క్రమంలో ధర్మారం గ్రామశివారులోని ఊరకుంట చెరువులో అతడి మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగి చనిపోయినట్లు మృతుడి తల్లి బానోతు చిన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ టి.సత్యనారాయణ తెలిపారు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంభునిపేట గిరిప్రసాద్ నగర్‌లోని ఎండీ. నవాజ్ ఇంటి పక్కన టీ-20 క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గోవర్ధన్ దాడి చేశారు. పారిపోయేందుకు యత్నించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద రూ.5 వేల నగదు, చరవాణి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లయ్య తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. HYD ఫిలింనగర్‌లోని ఓ బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు బార్‌లో తనిఖీలు నిర్వహించగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెరుకూరి రమేశ్ ఓ యాప్ ద్వారా IPL బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తేలింది. దీంతో రమేశ్‌ను అరెస్టు చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.16 వేలు స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. HYD ఫిలింనగర్‌లోని ఓ బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు బార్‌లో తనిఖీలు నిర్వహించగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెరుకూరి రమేశ్ ఓ యాప్ ద్వారా IPL బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తేలింది. దీంతో రమేశ్‌ను అరెస్టు చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.16 వేలు స్వాధీనం చేసుకున్నారు.
కామారెడ్డి మండలంలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఆకుల రమేశ్ శనివారం రాత్రి మలేషియాలో హార్ట్ స్టోక్ వచ్చి చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. రమేశ్ గత వారం మలేషియా వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడి స్నేహితుల ద్వారా సమాచారం అందిందన్నారు. ప్రభుత్వం స్పందించి రమేశ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట శవంతో ఓ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శ్వేత అనే గర్భిణీని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేయగా గర్భంలోనే శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృత శిశువును తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా వైద్యులు నిర్లక్ష్యం చేశారు. సాయంత్రం సిజేరియన్ చేసి శిశువును తొలగించారు. శ్వేత ఆరోగ్యం విషమించగా మంచిర్యాలకు తరలిస్తుండగా మృతి చెందింది.
ఈరోజు సాయంత్రం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ వరకు కేసీఆర్ రోడ్‌షో చేపట్టనున్నారు. జడ్పీ సెంటర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో రాత్రి బస చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి ఖమ్మం వస్తున్న కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్‌ఎప్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.