Telangana

News April 29, 2024

రిలే ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో నాగర్‌కర్నూల్ బిడ్డకు గోల్డ్ మెడల్

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సంగీత దుబాయ్‌లో జరిగిన 400 మీటర్ల రిలే ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం సాధించింది. వరల్డ్ వైడ్ దుబాయ్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఇండియాకు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. సంగీత తండ్రి శ్యామ్ జిల్లా ఎస్పీ ఆఫీసులో వైర్లెస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.

News April 29, 2024

NZB: ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాన పార్టీలు

image

ఉమ్మడి NZB జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారంలో ప్రధాన రాజ‌కీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ వేసవిలో నేతలు మాటల తూటాలతో మరింత వేడిపుట్టిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News April 29, 2024

కరీంనగర్: పోటీలో ఉండేది ఎవరు..?

image

లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో ఈరోజు తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉంది. దీంతో బరిలో ఎవరు ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో వెల్లడి కానుంది. 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్‌లో 53 మంది, పెద్దపల్లికి 63 మంది, నిజామాబాద్‌లో 42 మంది నామపత్రాలు దాఖలు చేశారు. 114 మందిలో తుది పోటీలో ఎవరు ఉంటారో మరికొద్ది గంటల్లో తేలనుంది.

News April 29, 2024

HYD: సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త!

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక PSలో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.

News April 29, 2024

మెదక్ ఎంపీ స్థానంపై స్థానికేతరుల నజర్!

image

మెదక్ లోక్‌సభ స్థానంపై స్థానికేతరులు దృష్టి సారించారు. ఈ స్థానానికి 54 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఇందులో ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగిలిన 53 మంది అభ్యర్థుల్లో 8 మంది అభ్యర్థులు స్థానికేతరులు ఇక్కడ నామినేషన్ వేయడం గమనార్హం. ఇందులో ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, వరంగల్‌కు చెందిన వారు నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.

News April 29, 2024

HYD: సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త!

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక PSలో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.

News April 29, 2024

దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారు: బాజిరెడ్డి

image

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని నిజామాబాద్ BRS అభ్యర్థి గోవర్ధన్ అన్నారు. ఆదివారం రాత్రి మోర్తాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మోదీ నిరుపేదలకు పంచుతానన్న నల్లధనం ఎటుపోయిందని ప్రశ్నించారు. దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, రేవంత్ రెడ్డి ఝూటాకోర్ అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఆశీర్వదించి మెజారిటీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు.

News April 29, 2024

ASF: మే 2న సీఎం సభ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 2న మధ్యాహ్నం ఒంటి గంటకు ఆసిఫాబాద్‌కు రానున్నారని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ఆదివారం తెలిపారు. స్థానిక ప్రేమల గార్డెన్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరిస్తారని తెలిపారు.

News April 29, 2024

ఈవీఎంల పనితీరుపై అవగాహన ఉండాలి: కలెక్టర్ క్రాంతి

image

ఈవీఎంల పనితీరుపై ఏఆర్వోలు, నోడల్ అధికారులకు అవగాహన ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలోని ఫంక్షన్ హాల్ లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధికారులకు అవగాహన సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.

News April 29, 2024

‘TTC ఉత్తీర్ణత అయిన వారికి గుడ్ న్యూస్’

image

HYD, ఉమ్మడి RR జిల్లాలో TTC(టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు) లోయర్ గ్రేడ్ టెక్నికల్ కోర్సు ఉత్తీర్ణులైన వారికి మే 1 నుంచి జూన్ 13 వరకు శిక్షణ ఉంటుందని తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, HYD,హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జిల్లాలో MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.