India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి సెగ్మెంట్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వల్లే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో దేశాన్ని దోచుకున్న బీజేపీని, రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీలను సమాధి చేయాలని కొత్తగూడెం ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన సీపీఐ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ బీజేపీ తన సమాధిని తానే తవ్వుకుంటుందన్నారు.
వడదెబ్బతో యువకుడు మృతి చెందిన సంఘటన జన్నారం పట్టణంలో జరిగింది. పట్టణంలోని వినాయక్ నగర్‌కు చెందిన మేడిశెట్టి మహేశ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం దేవాలయానికి వెళ్లే క్రమంలో వడదెబ్బ తగలడంతో మహేశ్ పోన్కల్ ప్రాంతంలో ఉన్న ఓ డ్రైనేజీలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
జగిత్యాల జిల్లాలో సూర్యుడు భగభగ మండుతున్నాడు. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని వెల్గటూర్ మండల కేంద్రంలో నేడు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వెల్గటూర్‌కు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది. ఎండల నేపథ్యంలో ఉదయం 10 నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. అటు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
సూర్యాపేటలో నేడు జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో నారాయణపేట జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు సత్తాచాటారు. మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్ చాంపియన్ షిప్ అండర్-14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో బసంత్ బంగారు పథకం సాధించగా, ఉమెన్స్ విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో శ్రీలత కాంస్య పతకం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తాయి.
మండల పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామ పరిధిలోగల రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు ఢీ కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎన్నికల సంఘం సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటుంది. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రజలు ఎక్కువగా వాడే వాట్సప్‌ను వినియోగించుకోవాలని జిల్లా అధికారులు అంటున్నారు. దీంతో వివిధ రకాల సమాచారాలను ఓటర్లకు చేరవేస్తున్నారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులుగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారని మెదక్ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ తిరిగి పుట్టినా రాజ్యాంగ సవరణ తప్ప మారదనే విషయాన్ని పీఎం మోదీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు అవిభక్త కవలలని ద్వజమెత్తారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో చిరుతపులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు ఫిర్యాదు మేరకు రన్‌వేతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుత, మరో రెండు పిల్లలను పట్టుకునేందుకు బోన్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలను బిగించారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో చిరుతపులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు ఫిర్యాదు మేరకు రన్‌వేతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుత, మరో రెండు పిల్లలను పట్టుకునేందుకు బోన్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలను బిగించారు.
Sorry, no posts matched your criteria.