Telangana

News April 28, 2024

4 స్థానాలు.. బరిలో 168 మంది

image

HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి MP స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114 మంది నామినేషన్ పత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు పరిశీలన కొనసాగింది. సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల  నామినేషన్ల పరిశీలన శనివారం ఉదయం వరకు కొనసాగింది. పరిశీలన పూర్తయ్యాక నాలుగు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు ఉన్నట్లు తేలిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

News April 28, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ వే పక్కన చిరుత కలకలం?

image

HYD శివారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ వే పక్కన చిరుత ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున చిరుతను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారని, ఇంకా రన్ వే పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిబ్బంది వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ దోచుకున్నంత బ్రిటిష్ వాళ్లు కూడా దోచుకోలే: అర్వింద్

image

కాంగ్రెస్ పార్టీ దేశంలో దోచుకున్నంతగా ప్రజాధనాన్ని బ్రిటిష్ వారు కూడా దోచుకోలేదని నిజామాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని 38వ డివిజన్ పరిధిలో 131, 132 బూత్‌లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో అరవింద్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వం కోరుకుంటున్నారన్నారు.

News April 28, 2024

మెదక్: ఎంపీ అభ్యర్థుల ప్రచారం.. ‘అగ్ని’ ఓ పరీక్షే

image

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఇక అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అభ్యర్థులు, వాటి శ్రేణులు సతమతమవుతున్నారు. వారికి ఎండ ఓ సవాలుగా మారింది. రెండు వారాలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. ఎండ తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

News April 28, 2024

భర్త సహకారంతోనే రాజకీయ ప్రస్థానం: ఆత్రం సుగుణ

image

జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మరొకరు ఆత్రం సుగుణ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ అయిదో తరగతి వరకు ఒకే పాఠశాలలో చదివారు. తమ గ్రామానికే చెందిన ఎంపీ వెంకటేశ్‌నేతను స్ఫూర్తిగా తీసుకొని, భర్త ఆత్రం భుజంగరావు సహకారంతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు సుగుణ చెప్పారు.

News April 28, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వేములవాడ రాజన్న స్వామివారికి పేరుంది.

News April 28, 2024

హైదరాబాద్: MMTSలో SIని బెదిరించి‌ చోరీ

image

MMTS రైలులో వెళుతున్న CRPF SI‌ను బెదిరించిన ఆగంతకులు గొలుసు లాక్కెళ్లిన సంఘటన కాచిగూడ రైల్వే PS పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి వాసి ప్రసాద్(CRPF SI) శుక్రవారం రాత్రి MMTSలో ప్రయాణించారు. యాకుత్‌పుర‌-ఉప్పుగూడ స్టేషన్ల మధ్యన ముగ్గురు ఆగంతకులు కత్తితో బెదిరించి ఆయన మెడలోని 15 గ్రాముల బంగారు గొలుసు, రెండు సెల్ ఫోన్లు దొంగిలించారు. కేసు నమోదైంది.

MBNR: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

రైలుపట్టాలు దాటుతున్న వృద్ధుడు రైలు ఢీకొని మృతి చెందిన ఘటన MBNR రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ వివరాలు.. తిమ్మసానిపల్లికి చెందిన ఎల్లయ్య (85) శనివారం దొడ్డలోనిపల్లిలో రైల్వే గేటు పడటంతో కింది నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అప్పుడే వచ్చిన మధురై ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.