Telangana

News April 28, 2024

అమిత్ షా వీడియో వైరల్..MP అర్వింద్ ఏమన్నారంటే..?

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే SC, ST, OBCలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై MP అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలు వీడియోలో అమిత్ షా రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను తీసేసి SC, ST, OBCలకు ఇస్తామని చెప్పారు’ అని వీడియో షేర్ చేశారు.

News April 28, 2024

HYD: పబ్‌లో కొట్టుకున్న యువకులు!

image

పబ్‌లో మద్యం తాగిన బడాబాబుల పిల్లలు ఓ యువతి విషయంలో ఘర్షణ పడ్డారు. పోలీసుల వివరాలు.. ఫిలింనగర్‌లోని మూన్‌షైన్‌ పబ్‌లో శనివారం అర్ధరాత్రి మందుబాబుల మధ్య గొడవ జరిగింది. పబ్‌కు వచ్చిన యువతితో కలిసి ఓ యువకుడు మద్యం తాగుతుండగా.. మరో యువకుడు ఆ యువతితో కలిసి డాన్స్ చేశాడు. దీంతో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 28, 2024

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

మోతె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎం.డి అంజాద్ అలీ ఖాన్ గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందారు. ఆయన సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. ఎంఇఓ గోపాల్ రావు మాట్లాడుతూ.. అంజాద్ మృతి విద్యారంగానికి తీరని లోటు అన్నారు. అంజాద్ మృతి పట్ల పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.

News April 28, 2024

మెదక్: అడవిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

నర్సాపూర్ మండల పరిధిలోని కొండాపూర్ అడవి ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న నర్సాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలు శివంపేట మండలానికి చెందిన మహిళగా అనుమానిస్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభించడంతో విచారణ చేపట్టినట్టు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.

News April 28, 2024

కరీంనగర్: ONLINE GAMES.. కొడుకుని చంపిన తండ్రి

image

కొడుకుని తండ్రి <<13131085>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన శ్రీనివాస్‌ కొడుకు శివసాయి(21) HYDలో ఉద్యోగం చేస్తున్నాడు. శివసాయి ఇంటికి రావడంతో, ఆన్‌లైన్‌ గేమ్‌‌లో డబ్బులు పోగొట్టొద్దని తండ్రీకొడుకుల మధ్య వాదన చోటుచేసుకుంది. ఈక్రమంలో భూమి అమ్మాలంటూ తండ్రిపై ఒత్తిడి తేవడంతో శుక్రవారం కొడుకు నిద్రిస్తున్న సమయంలో కారం చల్లి, రోకలి బండతో మోది హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 28, 2024

హనుమకొండలో కేసీఆర్ రోడ్ షో

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర నేడు హనుమకొండకి చేరనుంది. సాయంత్రం 6 గంటలకు అంబేడ్కర్ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. అనంతరం హనుమకొండ చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగిస్తారు. సమావేశం అనంతరం రాత్రి మాజీ ఎంపీ కెప్టెన్ వొడితల లక్ష్మీ కాంతారావు నివాసంలో బస చేస్తారు.

News April 28, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔సర్వం సిద్ధం.. ఉమ్మడి జిల్లాలో నేడు ఏకలవ్య గురుకుల ప్రవేశ పరీక్ష
✔GDWL,NRPT:పలు గ్రామాలలో కరెంట్ కట్
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న MBNR,NGKL ఎంపీ అభ్యర్థులు
✔MBNR,GDWL,NRPT,WNPT జిల్లాలలో రెడ్ అలర్ట్: వాతావరణ శాఖ
✔పలుచోట ఓటు హక్కు పై ర్యాలీలు
✔ఏర్పాట్లలో నిమగ్నం.. మే 1 నుంచి ‘వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు’ ప్రారంభం
✔TTC ఉత్తీర్ణత అయినవారు శిక్షణకు దరఖాస్తు చేసుకోండి!

News April 28, 2024

MBNR:  జిల్లాలో నిన్నటి ఉష్ణోగ్రతలు

image

వడ్డెమాన్ 44.2℃, జానంపేట 43.4, బాలానగర్ 43.2, కొత్తపల్లె 43.0, సల్కర్‌పేట 42.9, మహబూబ్ నగర్ 42.9, సెరివెంకటాపూర్ 42.8, మహబూబ్ నగర్ 42.5, అడ్డాకల్ 42.5, భూత్పూర్ 42.4, చిన్న చింత కుంట 42.4, దేవరకద్ర 42.2, హన్వాడ 42.2, మహమ్మదాబాద్ 42.2, కౌకుంట్ల 42.0, జడ్చర్ల 41.8, కొత్త మోల్గార 41.8, పార్పల్లి 41.4, మాచన్‌పల్లె 41.4, రాజాపూర్ 41.4, దోనూరు 40.9, నవాబుపేట 40.3, మిడ్జిల్లో 40.5℃గా నమోదైంది.

News April 28, 2024

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ మృతి చెందారు. కామారెడ్డి నుంచి కారులో తాడ్వాయి పోలీస్ స్టేషన్‌కు విధుల నిమిత్తం వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

News April 28, 2024

ఆదిలాబాద్: BJP అభ్యర్థి, ఆర్ఓ పై ఫిర్యాదు

image

ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌, కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషాపై బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్‌, ఆశిష్‌.. సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గోడంనగేశ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు నమోదు చేయలేదని, ఈ విషయంపై ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఈవో దృష్టికి తెచ్చారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించి, రిటర్నింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోవలన్నారు.