India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. NZB జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే కారణమని తెలుస్తోంది. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా పట్టుబడిన వారిని జైలుకు పంపిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా తీరు మారడం లేదు. ఈ ఏడాది 3 నెలల్లో NZB పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 649కి పైగా నమోదు కాగా 267 మందిని జైలుకు పంపించారు.
మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన రైతు అనంతయ్య తాను వేసిన వరి పంటను రక్షించుకోవాలని పొలానికి ట్యాంకర్లతో నీరందిస్తున్నారు. మరో 15 రోజుల పాటు నీరందిస్తే పంట చేతికి వస్తుందని, అందుకే నీరు పోస్తున్నట్లు రైతు తెలిపారు. తనకున్న 4 ఎకరాల్లో వరి నాటినట్లు తెలిపారు. అందులో అర ఎకరానికి నీరు అందకపోవడంతో ఎండిపోతుందని గమనించి ప్రతీ రోజూ 7,8 ట్యాంకర్లతో నీరందిస్తున్నట్లు తెలిపారు.
లంచం తీసుకుంటూ ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్ పట్టుబడ్డిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్‌లోని గంగాధర ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ సురేశ్‌బాబు నివాసంలో శనివారం అనిశా అధికారులు సోదాలు జరిపారు. రూ.12.30 లక్షల నగదు, 350 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తించారు. ఇంకా ఏమైనా ఆస్తులకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీశారు.
ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ ఘట్టం ముగియడంతో పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించి గెలుపుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహన ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్‌కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయస్సులో ఆయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 25 నుంచి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా బోర్గాం(పీ) కేంద్రంలో ఈయన పరీక్షలు రాస్తున్నారు. ఎల్లాగౌడ్ BSNLలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి 2007లో రిటైర్ అయ్యారు. గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి పాసైనట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 43, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 44.5 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యాహ్నా వేళలో అవసరముంటే తప్ప బయటకు రావద్దని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన బత్తుల కుమార్(45) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన కుమార్ తన భార్య మంజులకు ఫోన్‌చేసి తాను బొల్లారం చెరువు వద్ద ఉన్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో అక్కడ వెతకగా కనిపించలేదు. శామీర్‌పేట చెరువు వద్ద మృతదేహం లభ్యమైంది.
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన బత్తుల కుమార్(45) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన కుమార్ తన భార్య మంజులకు ఫోన్‌చేసి తాను బొల్లారం చెరువు వద్ద ఉన్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో అక్కడ వెతకగా కనిపించలేదు. శామీర్‌పేట చెరువు వద్ద మృతదేహం లభ్యమైంది.
గూడురు మండలం తీగలవేణి గ్రామానికి చెందిన రాజన్న (25) హసన్‌పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇటీవల ఆమెకు వేరే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. రెండేళ్లుగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని మరో అబ్బాయితో నిశ్చితార్థం చేసుకుందని తీవ్ర మనస్తాపానికి గురైన అతడు సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు శనివారం కేయూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకు పెట్టి బలుపు దింపాలని BRS అధినేత KCR పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో భాగంగా శనివారం NGKLలో KCR ప్రసంగించారు. మళ్లీ BRS ప్రభుత్వం వస్తుందని అన్నారు. ‘సీఎం మాటలు కోటలు దాటుతుంటే పనులు గడప దాటడం లేదు. దుర్మార్గ కాంగ్రెస్ పాలన పోవాలంటే BRSకు పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతివ్వాలి. KCR చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో పోరాటం చేశాను తెలంగాణ సాధించాను’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.