Telangana

News July 18, 2024

దమ్మపేట: పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి

image

పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. దమ్మపేట మండలం జమేధారు బంజర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 18, 2024

ఎన్నికల హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తాం: ఎంపీ రేణుక చౌదరి

image

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అధ్యక్షతన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ రేణుక చౌదరి మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన రాష్ట్రంలోని ప్రతీ రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీని అధికారంలోకి వచ్చిన 7 నెలలలోనే ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు.

News July 18, 2024

ములుగు DMHOను అభినందించిన మంత్రి రాజనర్సింహ

image

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ములుగు <<13649861>>DMHO <<>>డా.అల్లెం అప్పయ్యకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి, కొండలు ఎక్కి, వాగులు దాటి ఆదివాసీలకు వైద్యసేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ములుగు DMHOను ఆదర్శంగా తీసుకుని ఇతర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజనులకు వైద్యసేవలు అందించాలని కోరారు.

News July 18, 2024

రైతులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నాం: కొండా సురేఖ

image

WGL: ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని, రాష్ట్రంలోని రైతుల తరఫున సీఎంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు.

News July 18, 2024

NZBలో కారు బీభత్సం.. చికిత్స పొందుతున్న బాలిక మృతి

image

నిజామాబాద్ నగర శివారులోని దాస్ నగర్‌లో జరిగిన <<13627996>>కారు ప్రమాదంలో<<>> గాయపడిన బాలికల్లో ఒకరైన ఈశ్వరి (13) గురువారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు మరణించింది. కాగా ఇప్పటికే ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.

News July 18, 2024

KNR: గ్రూప్-1 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

image

గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహికులు దరఖాస్తులను వెబ్‌‌సైట్
www.tgbcstudycircle.cgg.gov.inలో ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 75 రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22న మొదలవుతుందన్నారు.

News July 18, 2024

MBNR: నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేయడానికి రూ.7 వేల కోట్లు మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు సంబరాలు చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గం కేంద్రంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రుణమాఫీ పొందే రైతులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

News July 18, 2024

పెబ్బేరు: హత్య కేసులో ముగ్గురికి రిమాండ్

image

పెబ్బేరు పట్టణంలోని చెలిమిల్లలో ఈనెల 13న నాగరాల నర్సింహ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. మృతుడి కుమారుడు శివకుమార్, అతని భార్య సుహాసిని, తల్లి గోవిందమ్మలు కలిసి గొడ్డలితో నరికి చంపినట్లు ఎస్సై చెప్పారు. నర్సింహ మద్యానికి బానిసై తమకు ఉన్న పొలాన్ని అమ్ముతాడనే అనుమానంతో గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపారు.

News July 18, 2024

సిద్దిపేట: డీఎస్సీ పరీక్ష కేంద్రాలను సందర్శించిన సీపీ

image

డీఎస్సీ పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సందర్శించారు. సిద్దిపేట పట్టణంలో ఉన్న డీఎస్సీ పరీక్ష కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన సీపీ బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపి మధు ఉన్నారు.

News July 18, 2024

కొత్తగూడెం: గ్రూప్-1 మెయిన్స్‌కు ఫ్రీ కోచింగ్

image

తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్‌ను అందిస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.