India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, BRSనేతల తీరుపై కరీంనగర్ MPబండి సంజయ్ విరుచుకుపడ్డారు. 6గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరుపార్టీల నేతలు డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగ్‌ల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. 100రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు.
ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఆళ్లపల్లి మండలం మండలం అనంతోగులో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద చెకింగ్ చేశారు. ఎమ్మెల్యే వారికి సహకరించారు. ఎస్సై ఈ.రతీష్, హెడ్ కానిస్టేబుల్ వేములపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ BRS MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ కమిట్మెంట్ ఉన్న నాయకుడని, అలాంటి వ్యక్తిని MPగా గెలిపించుకుంటే మన ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మాజీ సీఎం KCR అన్నారు. నాగర్ కర్నూల్‌లో శనివారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన RS ప్రవీణ్ కుమార్ వాటిని ఏ విధంగా తీర్చిదిద్దారో మీ అందరికీ తెలుసు అని అన్నారు.
జిల్లా ప్రజలు 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. శనివారం ఆయన ఛాంబర్ మాట్లాడుతూ.. 5 రోజులపాటు జిల్లాలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం వేళలో ఎవరు ఎండలో తిరగరాదని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలన్నారు. లేత తెలుపు రంగు వదులుగా ఉండే దుస్తులు ధరించాలని సూచించారు.
ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. కాగా తీన్మార్ మల్లన్న 2021లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. సూర్యాపేటకు చెందిన నరసింహా రెడ్డి, వరంగల్‌కు చెందిన రాకేశ్ రెడ్డి BRS తరఫున పోటీకి ఆసక్తి చూపతుండగా.. బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.
NLG, MLG మున్సిపల్ పార్కులకు మహర్దశ పట్టనుంది. అమృత్ స్కీం కింద రెండు పట్టణాల్లోని పార్కులను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. లక్ష జనాభా దాటిన ఈ రెండు మున్సిపాలిటీలు గతంలో అమృత్ స్కీం కింద ఎంపికైన విషయం తెలిసిందే. ఒక్కో పార్కుకు రూ.10 లక్షలు చొప్పున రెండు మున్సిపాలిటీల్లోని మొత్తం 12 పార్కులకు రూ.1.20 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మాజీ CM KCRపై సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRతో పాటు అప్పటి కేబినెట్‌లోని 39 మంది MLAలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.
మాజీ CM KCRపై సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRతో పాటు అప్పటి కేబినెట్‌లోని 39 మంది MLAలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.
దేవుళ్ల పేరుతో బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. పదేళ్లలో కేంద్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. శనివారం ఆమె ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. బీజేపీ పేదలపై పన్నులు వేస్తూ దుర్మార్గ పాలన చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. మాజీమంత్రి హరీశ్‌రావుకి పదవి మీద తప్పా, ప్రజల మీద ప్రేమ లేదని దుయ్యబట్టారు.
క్రికెట్ బెట్టింగ్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. బీటెక్ విద్యార్థి వినీత్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఏకంగా రూ. 25 లక్షలు లోన్ తీసుకొని క్రికెట్ బెట్టింగ్ పెట్టి పోగొట్టుకొన్నాడు. తిరిగి ఆ డబ్బులు చెల్లించలేక మనస్తాపానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు అయోధ్యకి వెళ్లడంతో ఇంట్లో ఎవరులేని సమయంలో శనివారం సదాశివపేటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
Sorry, no posts matched your criteria.