Telangana

News April 27, 2024

నిజామాబాద్ జిల్లాలో అతివలే నిర్ణేతలు..!

image

NZB లోక్‌సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌(U), నిజామాబాద్‌(R), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. నెల రోజుల్లో 3,294 మంది ఓటర్లు పెరిగారు. పురుషులు 8,06,130, మహిళలు 8,98,647, ట్రాన్స్‌జెండర్స్‌ 90 మంది ఉన్నారు. మెుత్తంగా మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితం అతివల నిర్ణయంపై ఆధారపడి ఉంది.

News April 27, 2024

MBNR: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటిద్దాం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున వృద్ధులు చిన్నారులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* తెలుపు రంగు గల కాటన్ దుస్తులను ధరించండి
* అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రండి
* కళ్లకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ను వాడండి
* దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగండి
* వీలైనంతవరకు ఇంట్లో ఉండండి.

News April 27, 2024

KZR: అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలో అనుమానాస్పద స్థితిలో సంజీవయ్య కాలనీకి చెందిన బొమ్మెన వినోద్(30) మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.

News April 27, 2024

కాంగ్రెస్‌లోకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కీలక నేత

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న జేవీఎస్ చౌదరి పార్టీ మారనున్నట్లు ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సుదీర్ఘ మంతనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కొంతకాలం పనిచేసిన అనుభవం జేవీఎస్‌కు ఉంది. ఆ అనుభవంతోనే శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

News April 27, 2024

సిద్దిపేట: కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదు: హరీష్ రావు

image

కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. 2001 ఏప్రిల్‌లో హైదరాబాద్ జలా దృశ్యంతో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్తానం నేడు దేశానికి ఆదర్శం అయిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటమి గెలుపులు కొత్త కాదని అన్నారు. పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి సత్తా చాటాలన్నారు.

News April 27, 2024

బాన్సువాడలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బాన్సువాడ పట్టణంలోని బస్సు డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నాచుపల్లికి చెందిన సాయికుమార్, చించోల్లికి చెందిన మారుతి శుక్రవారం రాత్రి బైక్ పై వెళ్తుండగా బస్ డిపో వద్ద కారు వీరి వాహనాన్ని ఢీకొంది. వారిద్దరూ కింద పడిపోగా వెనక నుండి వచ్చిన లారీ వారి కాళ్లపై నుండి వెళ్ళింది. తీవ్రంగా గాయపడ్డ మారుతి మృతి చెందగా, సాయి కుమార్ చికిత్స పొందుతున్నాడు.

News April 27, 2024

కరీంనగర్: వచ్చే 5 రోజులు జాగ్రత్త

image

వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడగాలులు వీస్తాయని, ఉ. 11 నుంచి సా.4 వరకు బయటకు రావొద్దని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లు తెలిపింది.

News April 27, 2024

నార్నూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ఇంద్రవెల్లి మండలం ధనోర(బి)లో నిన్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న నార్నూర్ మండలం చోర్‌గావ్‌కు చెందిన అడ మధుకర్, దుర్వ చందు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరిని చికిత్స నిమిత్తం 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వారు ఇవాళ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 27, 2024

వరంగల్: 1.67లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు

image

ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1,67,853 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో వరంగల్ జిల్లాలో 43,594మంది, హన్మకొండ- 43,483, మహబూబాబాద్- 34,759, జనగామ- 23,320, భూపాలపల్లి- 12,460, ములుగు-10,237 మంది ఉన్నారు. వీరి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 222 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

News April 27, 2024

KMM: సోషల్ మీడియాలో ప్రచార జోరు..

image

ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఆర్భాటాలు, ర్యాలీలు, మైకుల హోరు, ప్రచార వాహనాల జోరు ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోషల్ మీడియా ప్రచారం జోరందుకుంది. ర్యాలీలు, కార్నర్ మీటింగ్, అగ్రనాయకులను రప్పిస్తూ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఉదయం వాకింగ్లో యువతను పలకరిస్తున్నారు.
ఇంటింటి ప్రచార బాధ్యతలను స్థానిక నేతలే చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.