India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ పక్కాగా జరగాలని అధికారులను మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి హౌసింగ్ పీడీ మాణిక్యం, డీపీఓ యాదయ్యతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ కార్యక్రమంపై సంబంధిత ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు నియమితులైన వెరిఫికేషన్ అధికారులకు సూచనలు చేశారు.
నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ అవార్డు-2025కు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రాంమెాహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. స్వయం ప్రతిపత్తి హోదాలో ఉత్తమ ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలో ఐదో స్థానం సాధించిందని పేర్కొన్నారు.
నేలకొండపల్లి మండలంలో గల జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం కేంద్రాన్ని, రాజేశ్వరపురంలోని రైస్ మిల్లును శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, కాంటాలు, బిల్లులు వంటి అంశాలపై రైతులు, మిల్లర్లతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిల్లర్లకు, అధికారులకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఇలాంటి చర్యలు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా చేయాలన్నారు.
HYDలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఉక్కపోత కారణంగా ఏసీలు, కూలర్ల వినియోగం అధికంగా ఉండటంతో మీటర్లు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 24న 3795 మెగా వాట్లను వినియోగించగా ఈ ఏడాది అదే రోజు 4,170 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఏప్రిల్ 23 2024లో 3,745 మోగా వాట్లు వినియోగించగా ఈ ఏడాది 4,136 వాడారు. ఈ వారం, పది రోజుల్లో వినియోగం ఇంకా ఎక్కువ ఉండే అవకాశముంది.
టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు.
వేసవి సెలవుల్లో జూపార్క్ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. మే నెలలో జూ టూర్ పేరుతో చిన్నారులకు జూ మొత్తం చూపించనున్నారు. స్నాక్స్, భోజనం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక ప్రత్యేకంగా రూపొందించిన కిట్ (క్యాప్, నోట్‌బుక్, బ్యాడ్జ్) ఇస్తారు. రూ.1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే ఈ అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. 9281007836కు వాట్సప్‌లో సంప్రదించవచ్చు.
8, 9,10 విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో కమ్యూనికేషన్ ఇంగ్లిష్‌పై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (CELT) ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన తరగతులు కూడా ఉంటాయి. రోజూ ఉదయం 8.15 నుంచి 9.45 వరకు శిక్షణ ఉంటుంది. వివరాలకు 7989903001 నంబరుకు ఫోన్ చేయవచ్చు.
నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జి.వి.ఎన్.భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం తెలిపారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు.
వరకట్నం ఇచ్చే విషయమై ఒప్పంద పత్రం రాస్తేనే పెళ్లి జరుగుతుందని వరుడు తెగేసి చెప్పడంతో పీటలపైన పెళ్లి ఆగిపోయిన ఘటన కూసుమంచిలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీయువకుడు ఇష్టపడ్డారు. ఇరువర్గాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వరుడు నగదు, ఎకరా భూమి ఎప్పుడు ఇస్తారో ఒప్పంద పత్రం రాసి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పెళ్లి నిలిచిపోయింది.
Sorry, no posts matched your criteria.