Telangana

News April 27, 2024

NZB: అప్పుడు కలెక్టర్లు.. ఇప్పుడు MLA అభ్యర్థులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా పని చేసి పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. 2007 నుంచి 2009 వరకు కలెక్ట‌ర గా పనిచేసిన బి. రామాంజనేయులు..ఇప్పుడు ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2010 నుంచి 2012 వరకు కలెక్టర్‌గా పనిచేసిన డి.వరప్రసాద్..రాజోలు నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. మరీ వారికి విజయం వరిస్తుందో లేదో చూడాలి

News April 27, 2024

మందమర్రి: కుటుంబ కలహాలతో సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

image

మందమర్రి ప్రాణహిత కాలనీలో మేడ మహేష్(55) అనే సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మద్యానికి బానిసైన మహేష్ కూర విషయంలో భార్య, కొడుకుతో శుక్రవారం గొడవ పడ్డాడు. దీంతో ఇంటి బయట కుటుంబ సభ్యులు ఉండగా గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహ్యత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని సీఐ శశిధర్రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News April 27, 2024

HYD: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కుల్సుంపుర పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రామస్వామి వివరాలు.. కార్వాన్ బంజావాడి ప్రాంతానికి చెందిన అంబటి శ్రీకాంత్ (36) కొంతకాలంగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడి చేసి బెట్టింగ్ కు సంబంధించిన రూ.22,900 స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 27, 2024

MBNR: నేటి నుంచి పెళ్లిళ్లకు బ్రేక్

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెళ్లిళ్లు శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేకు పడనుంది. గత నాలుగు నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల పెళ్లిళ్లు జరిగాయని పురోహితులు అంచనా వేశారు. ఈ నాలుగు నెలల్లో బ్రాహ్మణులు, ఇతర కుల వృత్తుల వారు, బంగారం వ్యాపారులు, ఫంక్షన్ హాల్ యజమానులు, టాక్సీలు, వస్త్ర వ్యాపారులకు చేతినిండా పని దొరికింది. మూఢంతో 4 నెలల పాటు పని లేకుండా పోయిందని పలువురు అన్నారు.

News April 27, 2024

ఆర్ఆర్ఆర్ ఛాయ్.. చాలా స్పెషల్

image

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విన్నూత్న ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఖమ్మంలోని ఇవాళ ఉదయం టీడీపీ కార్యాలయం ఎదుట ఉన్న హోటల్‌లో ఇదీ ఆర్ఆర్ఆర్ ఛాయ్ స్పెషల్ అంటూ తనదైన శైలిలో అందరికి అందించారు. అనంతరం అక్కడే అల్పాహారం సేవించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, బేబీ స్వర్ణకుమారి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

News April 27, 2024

HYD: DDN విధానంలో ఏం చేస్తారు..?

image

HYD నగరంలో డిజిటల్ డోర్ నంబరింగ్ కోసం ఇంటింటికీ సర్వే జరిపి ఇంటి పాత నంబర్, బస్తీ పేరు, ప్రాంతం, ఇంటి ఫొటో, యజమాని ఫోన్ నంబర్ సేకరిస్తారు. ఆంగ్ల అక్షరాలు, అంకెల కలయికతో ప్రతి ఇంటికి నంబర్లను కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఉపయోగించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS సాయంతో ఇంటిని గుర్తించి, నేరుగా అక్కడికి చేరుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

News April 27, 2024

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్ ట్వీట్

image

BRS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘రెపరెపలాడే గులాబీ పతాకం.. తెలంగాణ ఎగరేసిన జయ కేతనం. మనమే తెలంగాణ దళం. మనమే తెలంగాణ గళం. జెండా మోసి.. జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం..బలగం. కంటికి రెప్పలా పార్టీని కాపాడుకున్న మీ పట్టుదలకు.. మీ శ్రమకు.. మీ కృషికి.. సదా సలాం..! BRS కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

News April 27, 2024

MBNR: పార్లమెంట్ ఎన్నికలు.. 4,004 పోలింగ్ కేంద్రాలు

image

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు..
✓ మహబూబ్‌నగర్ – 275, ✓ జడ్చర్ల – 274, ✓ దేవరకద్ర – 289, ✓ నారాయణపేట – 270, ✓ మక్తల్ – 284, ✓ కొడంగల్ – 282
✓ షాద్‌నగర్ – 263, ✓ నాగర్ కర్నూల్ – 264
✓ అచ్చంపేట – 339, ✓ కల్వకుర్తి – 271
✓ కొల్లాపూర్ – 292, ✓ వనపర్తి – 307
✓ గద్వాల – 303, ✓ అలంపూర్ – 291
రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,004 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

News April 27, 2024

నిజామాబాద్‌: బండరాయితో భర్తను హత్య చేసిన భార్య

image

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నిత్యం మద్యం సేవించి వేధిస్తున్న భర్తను భార్య హతమార్చింది. ఈ ఘటన మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలోని వడ్డెర కాలనీలో జరిగింది. బోధస్ లక్ష్మణ్(35) అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా అతని భార్య లక్ష్మీ బండరాయితో తలపై మోది హత్య చేసింది. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన లక్ష్మీ బండరాయితో కొట్టి హత్య చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు.

News April 27, 2024

డిజిటల్ డోర్ నంబరింగ్‌పై GHMC కసరత్తు!

image

ఢిల్లీ లాంటి నగరాల మాదిరిగా HYD వ్యాప్తంగా డిజిటల్ డోర్ నంబరింగ్ (DDN) చేయడంపై GHMC కసరత్తు చేస్తోంది. 2018లో మూసాపేటలో పైలట్ ప్రాజెక్టుగా ఆధార్ అనుసంధానంతో 7 అంకెలతో కూడిన డిజిటల్ డోర్ నంబర్ కేటాయించే కార్యక్రమం ప్రారంభించింది. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. DDN కేటాయించడం వల్ల ఇంటి అడ్రస్ తెలుసుకోవడం సులభతరం అవుతుంది. DDN కేటాయిస్తామని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గతంలోనూ చెప్పారు.