India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొడుకును ఓ తండ్రి హత్యచేశాడు. KNR జిల్లా కొత్తపల్లి PS పరిధిలో జరిగింది. చింతకుంట గ్రామానికి చెందిన శివ సాయి(21) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం ఇంట్లో శుభకార్యానికి వచ్చిన సాయిని కన్నతండ్రి శ్రీనివాస్(50) శుక్రవారం ఉదయం కళ్ళల్లో కారం చల్లి, రోకలి బండతో తలపై కొట్టి హత్యచేశాడు. అనంతరం నిందితుడు కొత్తపల్లి PSలో లొంగిపోయాడు. కేసు నమోదైంది. వివరాలు తెలియాల్సి ఉంది.
ఖిలా వరంగల్ కోటలో గుర్తు తెలియని యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కోటలోని వ్యవసాయ క్షేత్రాలను ఆనుకొని ఉన్న రాతికోట మెట్లపై 20 ఏళ్ల యువకుడు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఎప్పుడు చేసుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు. ఘటనా స్థలానికి మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య, ఎస్ఐ గోవర్దన్ చేరుకొని పరిశీలించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు.
ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు గాను రఘురామిరెడ్డి వర్గీయులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తన వియ్యంకుడి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వెంకటేశ్
నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తుండగా, ఎలాగైనా పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ఎంపీ బీబీ పాటిల్, సురేష్ షెట్కార్, బీఆర్‌ఎస్ నుంచి గాలి అనిల్‌కుమార్ బరిలో నిలవగా పోటీ రసవత్తరంగా సాగుతుంది.
కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలంటూ ఒక ప్రేమ జంట ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పట్టణంలోని కొలిపూర కాలనీకి చెందిన డొంకూరి అఖిల్, అదే కాలానీకి చెందిన పూండ్రు దివ్య ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి వధువు తరఫు వారు అంగీకరించకపోవడంతో శుక్రవారం గణేశ్ మందిరంలో పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ వివాహం నచ్చని కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందని వారు పోలీసులను ఆశ్రయించారు.
మోపాల్ మండలంలో భర్తను భార్య గొంతు నులిమి చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కులాస్‌పూర్‌కు చెందిన సాయిరెడ్డి(52), రాధలకు 30 ఏళ్ల క్రితం వివాహం జరగగా వీరికి ముగ్గరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిగారింటి వద్దే ఉంటున్నారు. సాయిరెడ్డి తన భార్యను కుమార్తెను వేధిస్తుండటంతో వారు విసిగిపోయారు. ఈ క్రమంలో సాయిరెడ్డి నిద్రపోగా.. భార్య గొంతు నులిమి చంపింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించిన యువకుడిపై కాచిగూడ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. SI నరేశ్ కుమార్ వివరాల ప్రకారం.. శివరాంపల్లిలో నివాసం ఉంటున్న సాయికిరణ్ అలియాస్ నాని (20) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి కాచిగూడకు చెందిన ఓ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. బాలికను వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు.

చేవెళ్ల లోక్‌సభ స్థానానికి సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. అధికారులు నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. సరైన ఫార్మాట్‌లో లేని నామినేషన్లను తిరస్కరించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి మొత్తం 64 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పార్లమెంట్ స్థానానికి దాఖలైన నామినేషన్లలో 17 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 47 నామినేషన్లకు జిల్లా ఎన్నికల అధికారి శశాంక్ ఆమోదం తెలిపారు.

Sorry, no posts matched your criteria.