Telangana

News April 27, 2024

MBNR:35 నామపత్రాల ఆమోదం.. 7 తిరస్కరణ

image

లోక్ సభ నియోజకవర్గానికి బలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 42 మంది నామపత్రాలు దాఖలు చేయగా 35 మంది నామపత్రాలను ఆమోదించారు. వివిధ సాంకేతిక కారణాలతో ఏడుగురు అభ్యర్థుల పత్రాలు తిరస్కరించారు.

News April 27, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేడు నాగర్ కర్నూల్ కు మాజీ సీఎం కేసిఆర్ రాక
✔నంచర్ల:నేడు జాబ్ మేళా
✔నేడు PUలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఏర్పాటు
✔పోలింగ్ శాతం పెంచేందుకు పలుచోట్ల అవగాహన సదస్సులు
✔GDWL:నేడు పలు గ్రామాల్లో కరెంట్ కట్
✔అమరచింత:నేడు పట్టణంలో నీటి సరఫరా బంద్
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎంపీ అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీ సర్వే
✔సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు

News April 27, 2024

NZB: ‘10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ’

image

NZB పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మిర్యాల్ కర్ జయప్రకాశ్, పోతు అశోక్, మొహమ్మద్ జమీల్, ఎం.డీ.షాహెద్ ఖాన్, కొండూరు గంగాధర్, పానిగంటి రజితావాణి, చెంచుల అశోక్, బేగరి పోశం, మీసాల శ్రీనివాస్ రావు, వి.మహాతేజ నామినేషన్లు చెల్లుబాటు కాలేదన్నారు.

News April 27, 2024

MDK: ‘నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం’

image

ఎన్నికల్లో పైచేయి సాధించాలని ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. అవతలి పార్టీ మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా చేరికలను నాయకులు ప్రోత్సహిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానికంగా పెద్ద నేతలను చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పాటు ఇతర నాయకులు వస్తారని చేరికలను ప్రోత్సహిస్తున్నారు.

News April 27, 2024

MBNR: నరేంద్ర మోడీ దేశ ప్రజలను నయవంచన చేశాడు: కేసీఆర్

image

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను నయవంచన చేశాడని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై నిప్పులు చేరిగారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికైనా మేలు జరిగిందా అంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికలలో వారిని నమ్మి మోసపోవద్దని కోరారు.

News April 27, 2024

ADB: ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

image

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశాలకు అర్హులైన అనాథ, నిస్సహాయులైన జిల్లాకు చెందిన పదవ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మే 25వ లోగా దరఖాస్తులను ఆదిలాబాద్ బాలరక్షక్ భవన్‌లో అందించాలని కోరారు. వివరాలకు 9440289825 సంప్రదించాలన్నారు.

News April 27, 2024

రిజర్వేషన్లు రద్దుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది: సీఎం రేవంత్

image

రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ కాలనాగు లాంటి వాడు.. మనసులో పగ పెట్టుకుంటారు.. రాజ్యాంగం మార్చేందుకే 400 సీట్లు గెలిపించాలని కోరుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ పాలనలోనే పరిశ్రమలు వచ్చాయన్నారు. శుక్రవారం రాత్రి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ జన జాతర సభలో పాల్గొన్నారు.

News April 27, 2024

కంటోన్మెంట్‌ ఉపఎన్నిక.. నివేదిత గెలిచేనా?

image

కంటోన్మెంట్‌లో 1994లో TDP నుంచి సాయన్న ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999, 2004లో సత్తాచాటి హ్యాట్రిక్ కొట్టారు. 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో మళ్లీ TDP నుంచి గెలుపొందారు. 2018లోనూ ఆయనదే విజయం. సాయన్న మరణాంతరం 2023 ఎన్నికల్లో లాస్య నందిత(BRS) గెలుపొందారు. ఆమె మరణాంతరం ఎమ్మెల్యేగా సాయన్న మరో కూతురు నివేదిత(BRS) పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా? మీ కామెంట్?

News April 27, 2024

JGL: MP ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్

image

లోకసభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్లు జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా శుక్రవారం తెలిపారు. కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయ పరిశీలకుల సమక్షంలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ నిర్వహించారు. జిల్లాపరిధిలోని 930 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించామన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు నింజే, అడిషనల్ కలెక్టర్లు దివాకర, రాంబాబు తదితరులున్నారు.

News April 27, 2024

వరంగల్ మార్కెట్‌కి 2 రోజులు సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.