Telangana

News April 26, 2024

ఖమ్మం: JEE మెయిన్స్‌లో సత్తాచాటిన గురుకుల విద్యార్థులు

image

ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించారని ITDA పీఓ ప్రతీక్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. భద్రాచలం గిరిజన గురుకులంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన డీ.ఐశ్వర్య 79.06. శ్రావణి 74.57, నాగేశ్వరి 71.18. అర్హత సాధించారని తెలిపారు.

News April 26, 2024

మెదక్‌లో నామినేషన్ల పరిశీలన పూర్తి.. ఒకటి రిజెక్ట్

image

మెదక్ లోక్ సభకు వచ్చిన నామినేషన్ల పరిశీలన పూర్తైనట్లు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో పరిశీలించారు. సరైన పత్రాలు సమర్పించని 1 ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించినట్లు రాహుల్ రాజ్ వెల్లడించారు. 53 నామినేషన్లకు ఆమోదం తెలిపారు. ఇందులో 18 మంది వివిధ రాజకీయ పార్టీల తరఫున, 35 మంది IND అభ్యర్థులు ఉన్నారు.

News April 26, 2024

మే 1న కాగజ్ నగర్‌కు అమిత్ షా

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

News April 26, 2024

NLG: JEE మెయిన్స్‌లో సత్తాచాటిన గురుకుల విద్యార్థినులు

image

JEE మెయిన్స్ ఫలితాల్లో నల్గొండ పట్టణంలోని మైనార్టీ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలకు చెందిన దేశిరెడ్డి వినీల (33.10), శాగంటి సిరి (55.10), రుద్రారపు శ్రావ్య (64.41) వల్కి అక్షిత (28.05), అనంతుల శృతి (27.17) అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ షాహిన్ షేక్, అధ్యాపకులు అభినందించారు.

News April 26, 2024

వికారాబాద్: UPSC ఫలితాలు.. యువకుడి పొరపాటు

image

UPSC ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడికి నిరాశ మిగిలింది. తరుణ్ కుమార్‌‌ ఆల్‌ ఇండియాలో‌ 231వ ర్యాంకు సాధించినట్లు తొలుత వార్తలొచ్చాయి. అభ్యర్థిని పరిగి MLAతో పాటు తదితర రాజకీయ నేతలు‌ సన్మానించారు. కానీ, హాల్ ‌‌టికెట్‌ నంబర్ ద్వారా చెక్ చేస్తే హరియాణాకు చెందిన యువకుడిగా తేలింది. క్రాస్‌చెక్‌ చేసుకోకపోవడంతో‌ యువకుడు పొరపాటు పడ్డట్లు‌ గ్రామస్థులు తెలిపారు. 

News April 26, 2024

MBNR: మరో 10 రోజులు జాగ్రత్త !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పలుచోట్ల 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా పానగల్‌లో 44.4 డిగ్రీలు నమోదైంది. నేటి నుంచి మరో 10 రోజులపాటు విపరీతమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని అధికారులు చెబుతున్నారు.

News April 26, 2024

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు 83,600

image

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ గురువారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు వేగం పెంచనున్నారు. నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా జిల్లాలోని 21 మండలాల పరిధిలో 83,600 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 50,513, మహిళలు 33,083, ఇతరులు నలుగురు ఉన్నారు.

News April 26, 2024

చట్ట వ్యతిరేఖ చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదు: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతూ నేరాల నియంత్రణకై పటిష్టమైన చర్యలు చేపడతామని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా, పిడిఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణా, నకిలీ విత్తనాల అక్రమ రవాణా, పేకాట, కోడి పందాలు ఆడేవారిపై, గుడుంబా తయారీపై నిఘా పెట్టామని పేర్కొన్నారు.

News April 26, 2024

అనుజ్ఞను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

image

ఇంటర్ (MPC) స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనుజ్ఞ శుక్రవారం తన తల్లిదండ్రులతోపాటు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత చదువుల్లో సైతం ఇలాగే రాణించాలని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సూచించారు. MPCలో 1000 మార్కులకు గాను 993 మార్కులు అనుజ్ఞ సాధించిన విషయం తెలిసిందే.

News April 26, 2024

అనుజ్ఞను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

image

ఇంటర్ (MPC) స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనుజ్ఞ శుక్రవారం తన తల్లిదండ్రులతోపాటు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశార. ఈ సందర్భంగా ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత చదువుల్లో సైతం ఇలాగే రాణించాలని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సూచించారు. MPCలో 1000 మార్కులకు గాను 993 మార్కులు అనుజ్ఞ సాధించిన విషయం తెలిసిందే.